విజయ్, మురుగదాస్ సినిమాకు బడా నిర్మాత !
Published on Dec 5, 2017 5:29 pm IST

విజయ్ నటించిన తాజా చిత్రం ‘మెర్సల్’ భారీ విజయాన్ని దక్కించుకున్న గతి తెలిసిందే. ఈ ఉత్సాహంలోనే విజయ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘తుపాకీ, కత్తి’ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఈ ప్రాజెక్ట్ పై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలను అందుకునేలా ఉండాలని సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించనున్నారు మురుగదాస్. ఇకపోతే ఈ భారీ ప్రాజెక్ట్ నుసన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని సన్ గ్రూప్స్ స్వయంగా ప్రకటించింది. అంతటి పెద్ద నిర్మాత ప్రాజెక్టులోకి ఇన్వాల్వ్ కావడంతో సినిమా స్థాయి ఇంకాస్త పెరిగింది. ఇకపోతే ఈ చిత్రాన్ని ఎప్పుడు మొదలుపెడతారు, నటీ నటులెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

విజయ్ ‘మెర్సల్’ తెలుగులో ‘అదిరింది’ పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమను కూడా తమిళంతో పాటే తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

 
Like us on Facebook