పుష్ప 2లో మరో సీనియర్ హీరో.. క్యారెక్టర్ అదే !

పుష్ప 2లో మరో సీనియర్ హీరో.. క్యారెక్టర్ అదే !

Published on Apr 25, 2022 10:00 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. బన్నీ నటన చూసి సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు. అయితే ప్రస్తుతం పుష్ప 2 కోసం బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు.

కాగా పుష్ప 2 పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. పుష్ప 2 లో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందట. ఆ క్యారెక్టర్ లో బాలీవుడ్ సీనియర్ సునీల్ శెట్టి నటించబోతున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. ఇక ఈ సినిమాలో సమంత తన డాన్స్‌తో, అలాగే రష్మిక తన నటనతో కేక పెట్టించారు. దేవిశ్రీప్రసాద్ కూడా తన మ్యూజిక్‌ తో మైండ్ బ్లాంక్ చేశాడు. పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు