సునీల్ ఆ రోజు వస్తున్నాడా ?
Published on Nov 16, 2017 1:39 pm IST

సునీల్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘2 కంట్రీస్’ ఎన్.శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మలయాళంలో మంచి విజయం సాదించింది. అదే పేరుతో తెలుగులో అనువాదం చేస్తోన్న ఈ సినిమాపై సునీల్ హోప్స్ పెట్టుకున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. డిసెంబర్ 23 న సినిమాను విడుదల చెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం.

ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్.శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నరేష్, పోసాని కృష్ణ మురళి, పృథ్వి ప్రదాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో సునీల్ కు జోడిగా మనీషా హీరొయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook