సినిమా కోసం తమిళం నేర్చుకుంటున్న సన్నీ లియోనీ !
Published on Feb 27, 2018 10:37 am IST

బాలీవుడ్ నటి సన్నీ లియోనీకి దక్షిణాదిన కూడ మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే పలు సినిమాల్లో స్పెషల్ పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆమె ఇప్పుడు ‘వీరమాదేవి’ చిత్రంతో పూర్తి స్థాయి కథానాయకిగా తెలుగు, తమిళ పరిశ్రమల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. దర్శకుడు విసి. వడివుడియన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో సన్నీ వారియర్ క్వీన్ గా కనిపించనుంది. పాత్ర కోసం ఇప్పటికే గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం వంటి విద్యల్ని అభ్యాసం చేసిన ఈమె మాటల్ని అర్థం చేసుకుని డైలాగ్స్ చెప్పినప్పుడే నటనలో పర్ఫెక్షన్ ఉంటుందని, సినిమా బాగా వస్తుందని భావించి తమిళ భాష కూడ నేర్చుకుంటోందట. చారిత్రక నైపథ్యంలో ఉండనున్న ఈ చిత్రాన్ని సుమారు.150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook