ఈ ఏడాది కోలీవుడ్ నుండి ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా రాణించలేదు. భారీ చిత్రాలు కూడా లేకపోవడం తో విజయ్ నటించిన గిల్లీ రీ రిలీజ్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే తమన్నా మరియు సుందర్ సి కాంబినేషన్ లో వచ్చిన అరణ్మనై 4 పంపిణీదారులకు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. సినిమా చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ, అరణ్మనై 4 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటింది.
కుటుంబ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలి వస్తున్నారు. హర్రర్ కామెడీ తమిళనాడులో హౌస్‌ఫుల్ బోర్డులను తిరిగి తెచ్చింది. తెలుగులో బాక్ పేరుతో విడుదలైన ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం సుందర్. సి. ఇందులో రాశి ఖన్నా, కెజిఎఫ్ రామచంద్ర, కోవై సరళ, శ్రీనివాస్ రెడ్డి మరియు వెన్నెల కిషోర్ కూడా కీలక పాత్రల్లో నటించారు.