తెలంగాణ ప్రభుత్వం నుండి అవార్డ్ అందుకోనున్న నందిని రెడ్డి !
Published on Mar 6, 2018 5:49 pm IST

తెలుగు పరిశ్రమలో ఉన్న మహిళా దర్శకుల్లో నందిని రెడ్డి కూడ ఒకరు. దర్శకురాలిగా పరిచయమైన మొదటి సినిమా ‘అలా మొదలైంది’తోనే ఘన విజయాన్ని అందుకున్న ఈమె ఆ తర్వాత ‘కళ్యాణ వైభోగమే’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ పనుల్లో ఈమెను తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది.

మార్చి 8న జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వినూత్న రంగాల్లో దూసుకుపోతూ మంచి గుర్తింపు పొందిన 20 మహిళలను ప్రభుత్వం సత్కరించనుంది. ఆ 20 మందిలో సినిమా రంగం తరపున నందిని రెడ్డి ఎంపికయ్యారు. అలాగే ప్రముఖ గాయని నిత్య సంతోషిని కూడ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

 
Like us on Facebook