ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించడానికి అదే అసలైన మార్గం – రాజమౌళి

Published on Jun 30, 2022 1:00 am IST

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, లేటెస్ట్ గా పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో పాన్ వరల్డ్ స్థాయిలో దర్శకుడిగా మరింత గొప్ప పేరుని, గుర్తింపుని దక్కించుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. ఇక ఆర్ఆర్ఆర్ తరువాత త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో తన నెక్స్ట్ మూవీ కోసం ప్రస్తుతం స్టోరీల ఎంపికపై పై తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి రాజమౌళి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక తరచు అక్కడక్కడా పలు ఇతర సినిమాల ఈవెంట్స్ కి కూడా గెస్ట్ గా విచ్చేస్తూ వారికి తనవంతుగా చేయూతనిచ్చే మంచి మనసు గల రాజమౌళి, నేడు లావణ్య ప్రధాన పాత్రలో నటించిన హ్యాపీ బర్త్ డే మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుకకి విచ్చేసి, ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉందని, దర్శకనిర్మాతలకు, అనే యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఎక్కువగా థియేటర్స్ కి రప్పించడం కష్టతరం అవుతోందని, అలానే కొన్నిచోట్ల థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందని కొందరు ఆందోళన చెందుతున్నారని అన్నారు. నిజానికి మనం ఎటువంటి జానర్ సినిమా తీయాలనుకున్నా పర్లేదు, అయితే దానిపై మనం గట్టిగా మనసు పెట్టి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగితే కనుక తప్పకుండా ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారని, అదే వారిని పక్కాగా థియేటర్స్ కి రప్పించడానికి సిసలైన మార్గం అని అన్నారు రాజమౌళి.

సంబంధిత సమాచారం :