కమల్ “విక్రమ్” ప్రీ రిలీజ్ వేడుక కి ఈ స్టార్ హీరోలు!

Published on May 31, 2022 12:10 pm IST


కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం విక్రమ్. ఈ చిత్రం లో విజయ్ సేతుపతి మరియు ఫాహద్ ఫజిల్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ను జూన్ 3, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

ఈ చిత్రాన్ని తెలుగు లో సైతం విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. ఇందుకు టాలీవుడ్ ప్రముఖ సినీ హీరో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో నితిన్ లు ముఖ్య అతిధులుగా రానున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఈ వేడుక లో కమల హాసన్ నితిన్ కొత్త చిత్రం లోని చిల్ మారో సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఈ వేడుక కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :