‘కృష్ణార్జున యుద్ధం’ నుండి మూడో పాట రెడీ !
Published on Mar 13, 2018 9:13 pm IST

నాని ద్విపాత్రాభినయం చేస్తోన్న ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 12 న ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. హిప్ హాప్ త‌మీజా సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.

షైన్ స్క్రీన్స్ బ్యానర్లో సాహు గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలోని రెండు పాటలు ఇప్పటికే విడుదకాగా మూడో పాట’ఉరిమే మనసే’ను మార్చి 15న సాయంత్రం 5 గంటలకు విడుదల చెయ్యబోతున్నారు. దినేష్ కుమార్ కోరియోగ్రఫీ అందించిన సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

 
Like us on Facebook