లేటెస్ట్..”లవ్ స్టోరీ” రిలీజ్ ఈ డేట్ కి ఫైనలైజ్.?

Published on Sep 10, 2021 10:01 am IST

మన టాలీవుడ్ లో ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో అక్కినేని యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం “లవ్ స్టోరీ” కూడా ఒకటి. మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ అవైటెడ్ చిత్రం నిజానికి ఈరోజు సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ చిత్రం మళ్ళీ పలు కారణాల చేత వాయిదా పడింది.

మరి దీనితో కొత్త రిలీజ్ ఎప్పుడు అన్నది ఆసక్తిగా మారింది. అయితే మరి లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం మేకర్స్ ఈ చిత్రానికి వచ్చే సెప్టెంబర్ 24న ఫిక్స్ చేశారట. ఇది వరకు రెండు డేట్స్ దీనికి వినిపించినా ఫైనల్ గా సెప్టెంబర్ 24 న లవ్ స్టోరీ చిత్రం థియేటర్స్ లో పడనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. ఇక ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు అమిగోస్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :