“ఆచార్య”కి కొరటాల దృష్టిలో ఈ డేట్ నే.!

Published on Oct 9, 2021 9:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ కమ్ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో గత కొన్ని రోజులుగా కాస్త బజ్ అలా వినిపిస్తుంది. అయితే వచ్చే డిసెంబర్ నెల 17కే ఈ డేట్ ఫిక్స్ అయ్యింది అని టాక్ ఉన్నా..

ఇంకా అధికారిక అప్డేట్ మాత్రం రాలేదు. అయితే పక్కాగా ఈ డేట్ కి సినిమాని రిలీజ్ చేసేయాలని కొరటాల మనసులో ఉందట. కానీ పలు కారణాల చేత నిర్మాతలు ఇంకా ఈ డేట్ ని కన్ఫర్మ్ చెయ్యాలా వద్దా అనే సంశయంలో ఉన్నట్టు వినికిడి. ఫైనల్ గా మాత్రం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున ఈ సినిమా ఈ ఏడాది వస్తుందా లేక వచ్చే ఏడాది వస్తుందా అనేది ఇంకా ప్రశ్నార్ధకంగానే మిగిలి ఉంది.

సంబంధిత సమాచారం :