తారక్ షో హిస్టరీలోనే అధిక రన్ టైం తో వీళ్ళ ఎపిసోడ్..!

Published on Nov 4, 2021 8:21 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన మరో గ్రాండ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” తో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాగే ఈ షో లో ప్రత్యేక అతిధులుగా టాలీవుడ్ పలువురు సినీ తారలు కూడా వస్తుంటారు. మరి అలా రీసెంట్ గా మన టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందులోని ఎన్టీఆర్ కి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన థమన్, దేవిశ్రీప్రసాద్ లు ప్రత్యేక అతిథులుగా వచ్చారు.

మరి ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ పట్ల ఇద్దరూ కూడా మంచి ఎగ్జైట్ అవుతున్నారు. అలా థమన్ పెట్టిన లేటెస్ట్ ట్వీట్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. మాములుగా అయితే ఈ షోలో ఏ ఎపిసోడ్ అయినా 45 నిమిషాలు మాత్రమే షూట్ జరుపుకుంటుంది కానీ తమ ఎపిసోడ్ మాత్రం ఏకంగా 3 గంటలు పాటు షూట్ జరుపుకున్నట్టు థమన్ తెలిపాడు. అందుకే చాలా ఎగ్జైట్ అవుతున్నానని ఈ ఎపిసోడ్ ని ఈరోజు రాత్రి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడమని తెలిపాడు. మొత్తానికి మాత్రం తారక్ షో కెరీర్ లోనే ఇద్దరి సెన్సేషనల్ మ్యూజిక్ కాంబో అతి పెద్ద రన్ టైం ఇచ్చారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More