“అఖండ” రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇందుకే రావట్లేదా?

Published on Sep 5, 2021 9:02 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. మాస్ అండ్ ఎమోషనల్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే భారీ అంచనాలని నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ప్రస్తుత బజ్ మాత్రం ఈ సినిమా వచ్చే అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ అవుతుంది అని వినిపిస్తుంది కానీ ఇంకా రిలీజ్ డేట్ పై మాత్రం ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. మరి దీనికి గల కారణం ఏంటో తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే..

ఇది కుదుట పడే వరకు అఖండ రిలీజ్ డేట్ పై అధికారిక క్లారిటీ వచ్చేలా లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :