‘లాల్ సింగ్ చడ్డా’ ప్రీమియర్ షో : సందడి చేసిన టాప్ స్టార్స్ ..

Published on Aug 7, 2022 12:00 am IST

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయా కామ్ 18 స్టూడియోస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ మూవీలో టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య, బోడి బాలరాజు అనే పాత్రలో నటించారు.

హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా పాన్ ఇండియా మూవీ గా ఆగష్టు 11న భారీ స్థాయిలో పలు భాషల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక నేడు హైదరాబాద్ లో ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్, నాగ చైతన్య, మెగాస్టార్ చిరంజీవి, మోనా సింగ్, అక్కినేని నాగార్జున, అమల మూవీని వీక్షించారు. అందరి నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో లాల్ సింగ్ చడ్డా టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ మూవీని తెలుగులో మెగాస్టార్ సమర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం :