యంగ్ హీరో సినిమాకు టాప్ రైటర్ నిర్మాత !
Published on Oct 31, 2017 2:47 pm IST

‘సోగ్గాడే చిన్నినాయన’ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో మంచి విజయం అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ త్వరలో మరో సినిమా మొదలుపెట్టబోతున్నాడు, ఈ సినిమాలో కూడా అక్కినేని హీరో నటించబోతుండడం విశేషం. సురేష్ బాబు, పీపుల్ మీడియా సంయుక్తంగా నిర్మిసున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత కోనా వెంకట్ మరో నిర్మాత. ఇప్పటికే కథా చర్చలు పూర్తీ అయిన ఈ సినిమాలో వెంకటేష్ & నాగ చైతన్య నటిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో మొదలుకాబోతుంది.

వెంకటేష్ తాజాగా తేజ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నారు, ఈ సినిమా నవంబర్ రెండో వారంలో ప్రారంభం కానుంది. పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకున్న నాగ చైతన్య మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి అంగీకరించారు, ఈ ప్రాజెక్ట్ తో పాటు కళ్యాణ్ కృష్ణ సినిమా మొదలుకానుందని సమాచారం. వెంకి, చైతు మల్టి స్టారర్ సినిమాపై సినీవర్గాల్లో, అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత మల్టి స్టారర్ ట్రెండ్ లో ఈ సినిమా మరో సంచలన విజయం సాదించాలని కోరుకుందాం.

 
Like us on Facebook