అదరగొట్టిన బాలయ్య “అన్ స్టాపబుల్ అంథెం!

అదరగొట్టిన బాలయ్య “అన్ స్టాపబుల్ అంథెం!

Published on Sep 27, 2022 7:29 PM IST


నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటుగా ఆహా వీడియో లో అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి సీజన్ ఈ షో ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మరోసారి అంతకు మించి ఈ షో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. తాజాగా ఆహా మేకర్స్ అన్ స్టాపబుల్ అంతెం ను విడుదల చేయడం జరిగింది.

ఈ అంతెం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ ఆంతెం ను మహతి స్వర సాగర్ స్వర పరచగా, రోల్ రైడా లిరిక్స్ అందించడం మాత్రమే కాకుండా పాడటం జరిగింది. బాలయ్య మేనరిజమ్స్, డైలాగ్స్ తో సూపర్ స్పెషల్ గా ఉంది. బాలయ్య అభిమానులకు, ప్రేక్షకులకు ఇక పండగే అని చెప్పాలి. అక్టోబర్ నుండి ఈ రెండవ సీజన్ మొదలు కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ న్యూస్ తో బాలయ్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు