సూర్య సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కుదిరాడు !
Published on Mar 13, 2018 4:23 pm IST

సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత కె.వి ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘వీడోక్కడే, బ్రదర్స్’ వంటి సినిమాలు వచ్చాయి. మూడోసారి వీరిద్దరు సినిమా చేస్తుండడం విశేషం.

తాజా సమాచారం మేరకు ఈ మూవీకి హరీష్ జైరాజ్ సంగీతం సమకూర్చబోతున్నట్లు తెలుస్తోంది. సూర్య చాలా సినిమాలకు హరీష్ మ్యూజిక్ చేసాడు. త్వరలో ఈ మూవీని అనౌన్స్ చెయ్యబోతున్నట్లు కోలివుడ్ టాక్. సూర్య, సెల్వ రాఘవన్ సినిమా షూటింగ్ తమిళనాడులో జరుగుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజ సంగీతం అందిస్తున్నాడు.

 
Like us on Facebook