వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఓటిటి పార్ట్నర్ లాక్

వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఓటిటి పార్ట్నర్ లాక్

Published on Dec 19, 2023 2:00 AM IST


యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ తో ఆకట్టుకుని అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ యొక్క ఓటిటి హక్కులు ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ మూవీ ఫిబ్రవరి 16న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు