వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా శివ రాజ్ కుమార్ “వేద”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా శివ రాజ్ కుమార్ “వేద”

Published on Apr 13, 2023 7:15 PM IST

కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో హర్ష దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా వేద. ఈ చిత్రం కన్నడలో సూపర్ హిట్ ను సాధించింది. తెలుగు లో కూడా డబ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది.

ఈ చిత్రం ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు లో ప్రసారం కానుంది. గణవి లక్ష్మన్, శ్వేత చెంగప్ప, ఉమ శ్రీ, అదితి సాగర్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు