తుది మెరుగులు తిద్దుకుంటున్న ‘వెంకీ- చై’ చిత్రం !
Published on May 24, 2018 11:57 pm IST


విక్టరీ వెంకటేష్ ,నవ యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోలు గా ఓ మల్టీ స్టాటర్ చిత్రం తెరకెక్కనుందని మనుకు తెలిసిందే. తాజా గా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. రైటర్ జనార్ధన మహర్షి ఈ చిత్ర కథను మొదటగా వెంకటేష్ కి వినిపించగా అయన చాలాబాగుందని రెండో పాత్ర కోసం చైతన్య సరిపోతాడని చెప్పడంతో రైటర్ కూడా చైతన్య కు స్టోరీ వినిపించాడు చై కూడా ఓకే చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన్చనున్నారు.అయితే స్టోరీ విషయంలో చిన్నపాటి మార్పులు చేర్పులు చేయమని చెప్పాడట వెంకీ .దింతో మహర్షి ,రైటర్ కోనవెంకట్ దర్శకుడు బాబీ లు కలిసి కొన్ని మార్పులు చేసిన అనంతరం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తిగా సిద్దమైనట్లు తెలుస్తుంది.

పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వెంకీ, చైతన్య మేన మామ ,మేనల్లుడు పాత్రల్లో నటించనున్నారు నిజ జీవితంలో కూడా వారు ఇదే బంధాన్ని కలిగి ఉండడం విశేషం . త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు అని సమాచారం . ఈ సినిమాకి సంబంధిచిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సిఉంది .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook