‘భరత్ అనే నేను’ ఆడియో వేడుకకు వెన్యూ ఫిక్సైంది !

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుదలకానున్న సంగతి తెలిసిందే. అందుకే చిత్ర టీమ్ ఆడియో వేడుకకు రంగం సిద్ధం చేశారు. ముందుగా ఈ వేడుకను ఏప్రిల్ 7వ తేదీన వైజాగ్లో నిర్వహించాలని అనుకోగా కొన్ని అనివార్య కారణాల వలన అది కుదరలేదు.

అందుకే అదే తేదీన హైదరాబాద్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వేడుక ఎక్కడన్నది మాత్రం ఇంకా నిర్ణయంపబడలేదు. ‘స్పైడర్’ తర్వాత మహేష్ చేస్తున్న చిత్రం కావడం, మహేష్ తో ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ చేసిన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుండటంతో ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మహేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు.