‘జై లవ కుశ’ ట్రైలర్ విడుదలకు వేదిక సిద్ధం !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ‘జై లవ కుశ’ చిత్రం యొక్క ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముందుగా చెప్పినట్టే టీమ్ ఈ నెల 10వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనుంది. కొద్దిసేపటి క్రితమే వేదికను కూడా ఖాయం చేశారు. హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో ఈ కార్యక్రమం జరగనుంది.

గణేష్ నిమజ్జనం కారణంగా ఆడియో వేడుకను భారీ ఎత్తున నిర్వహించలేకపోయిన టీమ్ ఈ కార్యక్రమాన్ని మాత్రం భారీ ఎత్తున చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్లకు మంచి స్పందన రావడం, ఆడియో బాగుండటం, ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.