సమీక్ష : “విధి” – డిజప్పాయింట్ చేసే క్రైమ్ థ్రిల్లర్

సమీక్ష : “విధి” – డిజప్పాయింట్ చేసే క్రైమ్ థ్రిల్లర్

Published on Nov 4, 2023 3:01 AM IST
Vidhi Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 03, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: రోహిత్ నంద, ఆనంది, మహేష్ ఆచంట, మీసం సురేష్ తదితరులు

దర్శకుడు : శ్రీకాంత్ రంగనాథన్ మరియు శ్రీనాథ్ రంగనాథన్

నిర్మాత: రంజిత్ ఎస్

సంగీతం: శ్రీచరణ్ పాకల

సినిమాటోగ్రఫీ: శ్రీనాథ్ రంగనాథ్

ఎడిటర్: శ్రీనాథ్ రంగనాథ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మరో చిన్న చిత్రం “విధి” కూడా రిలీజ్ అయ్యింది. మరి ప్రామిసింగ్ కాన్సెప్ట్ తో వస్తున్నాం అని చెప్తున్నా మేకర్స్ అందుకు తగ్గట్టుగా ఈ సినిమా ఉందో లేదో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథ లోకి వస్తే..ఓ చిన్నపాటి ఊరి నుంచి హైదరాబాద్ కి ఉద్యోగం కోసం వచ్చిన ఓ అమాయక యువకుడు సూర్య(రోహిత్ నంద). తన ఉద్యోగ క్రమంలో ఓ రోజు ఒక ఆసక్తికర పెన్ అతనికి దొరుకుతుంది. అయితే ఆ తరువాత ఆ పెన్ విషయంలో ఒక ఊహించని నిజాన్ని తాను తెలుసుకుంటాడు. అసలు ఆ పెన్ ఏమిటి? దాని వల్ల ఏమవుతుంది? అది వచ్చాక తన లైఫ్ ఎలా మారిపోయింది అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

మొదటగా ఈ సినిమాలో థ్రిల్ చేసే పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది సినిమా కాన్సెప్ట్ అని చెప్పాలి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ ఆసక్తిగా అనిపిస్తుంది. దానికి అనుగుణంగా డిజైన్ చేసుకున్న కొన్ని సీక్వెన్స్ లు కూడా మంచి థ్రిల్ ని కలుగజేస్తాయి.

అలాగే యంగ్ నటుడు నంద తన మొదటి సినిమా అయినా కూడా మంచి పెర్ఫామెన్స్ ని తాను అందించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో తాను షైన్ అయ్యాడని చెప్పొచు. అలాగే నటి కయల్ ఆనంది కూడా తన లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ లో కూడా మంచి నటన కనబరిచింది. అలాగే సినిమాలో కొన్ని చోట్ల కథనానికి తగ్గట్టుగా ఇచ్చిన స్కోర్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఆ సీన్స్ ని ఎలివేట్ చేసేలా అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమాలో మంచి మంచి లైన్ ఉన్నపటికీ పూర్తి స్థాయిలో అయితే కథనం అంత ఎంగేజింగ్ గా లేదు అని చెప్పక తప్పదు. మెయిన్ గా ఫస్టాఫ్ లో అయితే చాలా స్లో నరేషన్ కనిపిస్తుంది. దీనితో మెయిన్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళడానికి సమయం ఎక్కువ తీసుకున్నారు.

ఇంకా స్క్రీన్ ప్లే ని కానీ ఇంకా ఎఫెక్టీవ్ గా నార్త్ చేసి ఉంటే సినిమా మరింత సాలిడ్ గా అనిపించి ఉండేది. అలాగే మెయిన్ లీడ్ మధ్య మరికాస్త ఆకట్టుకునే సీన్స్ కానీ లాజికల్ గా సెట్ అయ్యే ఎపిసోడ్స్ ని డిజైన్ చేసుకోవాల్సింది.

అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ ని కూడా బెటర్ గా చేయాల్సింది. ఇక వీటితో పాటుగా చాలా వరకు సీన్స్ ని ఊహించదగిన విధంగానే అనిపిస్తాయి. కొన్ని ట్విస్ట్ లు కూడా మరీ అంత ఇంప్రెస్ చేయవు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక టెక్నీకల్ టీం లో అయితే శ్రీచరణ్ పాకల మరోసారి సాలిడ్ స్కోర్ ని అందించాడని చెప్పొచ్చు. అలాగే శ్రీనాథ్ రంగనాథన్ అందించిన సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ లు పర్వాలేదు.

ఇక దర్శకులు శ్రీకాంత్ రంగనాథ్ మరియు శ్రీనాథ్ రంగనాథ్ అనే ఇద్దరు యంగ్ దర్శకులు ఈ సినిమాకి వర్క్ చేయగా తమ ఐడియాతో మాత్రం వారు ఇంప్రెస్ చేస్తారని చెప్పాలి. అలాగే కొంతమేర ఎంగేజింగ్ స్క్రీన్స్ ప్లే రాసుకున్నప్పటికీ ఇది ఫుల్ టైం లో గాని మెయింటన్ చేసి ఉంటే ఈ సినిమాకి డెఫినెట్ గా అది బిగ్ ప్లస్ అయ్యి ఉండేది. ఒక స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “విధి” ఓ డిజప్పాయింట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పాలి. ఒక్క సెకండాఫ్, మెయిన్ లీడ్ వరకు ఓకె కానీ సినిమా అంతా స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. దీనితో ఈ చిత్రం ఏమంత ఎంగేజింగ్ గా అనిపించదు. మరి వీటితో అయితే ఈ వారాంతానికి దీని బదులు మరో సినిమా ప్లాన్ చేసుకుంటే బెటర్.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు