ఈవివి శిష్యుడి మూవీ ఓపెనింగ్ కి వివి వినాయక్ క్లాప్.
Published on Nov 6, 2014 12:05 pm IST

vv-vinayak
శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి తొలి ప్రయత్నంగా మరపట్ల కలధర్ చక్రవర్తి నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవం గురువారం ఉదయం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. కిరణ్, షాలూ, రిచా నటినటులుగా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా స్వర్గీయ ఈవివి సత్యనారాయణ శిష్యుడు సందీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో హీరోయిన్లు ఇద్దరికీ ఇదే తొలి సినిమా. ఈ సినిమా ప్రారంభోత్సవానికి వివి వినాయక్, బివివి చౌదరి, కాశి విశ్వనాధ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ముహూర్తపు సన్నివేశానికి వివి వినాయక్ క్లాప్ నివ్వగా, బివివి చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కాశి విశ్వనాధ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అతిధులు సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

కథను నమ్మి ఈ సినిమా తీస్తున్నాం. నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. సినిమాలో 5 పాటలు ఉంటాయి. వాటి రికార్డింగ్ పూర్తయింది. అని నిర్మాత మరపట్ల కలధర్ చక్రవర్తి తెలిపారు. కథకు సూట్ అయ్యే హీరో హీరోయిన్లను సెలెక్ట్ చేసుకున్నాను. సినిమా 1970 బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. కిషన్ కవాడియా మంచి సంగీతం అందించారు. నిర్మాతలు అందించిన సహకారం మరువలేనిది. అని దర్శకుడు సందీప్ అన్నారు.

 
Like us on Facebook