ప్రియ ప్రకాష్ వారియర్ స్థానంలో ఏ హీరోయిన్ నటించబోతోంది ?
Published on Mar 8, 2018 7:12 pm IST

మళయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఒరు ఆడార్ లవ్ చిత్రంలో పాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ పాటలో ప్రియా ప్రకాష్ వారియర్ ఇచ్చిన ఎక్ష్ప్రెషన్స్ కు అందరు ఫిదా అయ్యారు. తెలుగులో ఈ అమ్మాయికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కాని ఇంకా ఏ సినిమా ఓకే చెయ్యలేదని సమాచారం.

నిఖిల్ తను నటించే తమిళ్ కనితన్ రీమేక్ లో ఈ అమ్మాయిని తీసుకుందామని ట్రై చేసాడు, కాని కుదరలేదు. తాజా సమాచారం ఏంటంటే.. ఈ అమ్మాయి నటించిన ఒరు ఆడార్ లవ్ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను వికెఎ ఫిలిమ్స్ సంస్థ ఫాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఏ తెలుగు హీరో నటిస్తాడో చూడాలి. ముఖ్యంగా ప్రియ పాత్రలో ఎవరు కనిపించాబోతున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 
Like us on Facebook