ఉక్రేయిన్ నుంచి టర్కీకి బయలుదేరిన మెగాహీరో!
Published on Nov 13, 2016 3:08 pm IST

saidharamtej
కెరీర్ మొదట్నుంచే వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకున్న యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్, ’తిక్క’తో మాత్రం తడబడ్డ విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా పరాజయం తర్వాత మళ్ళీ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో తన స్టైల్లోనే ఆయన చేస్తోన్న ’విన్నర్’ అనే కమర్షియల్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కొద్దిరోజులుగా ఉక్రేయిన్‌లో షూటింగ్ జరుపుకోగా, తాజాగా టీమ్ ఉక్రేయిన్ షెడ్యూల్‌కు బై బై చెప్పేసింది.

ఉక్రేయిన్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తైందని, ఇప్పుడు టర్కీకి వెళుతున్నామని సాయిధరమ్ తెలిపారు. ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం కానుకగా ఫిబ్రవరి 24, 2017న సినిమాను పక్కాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా టీమ్ ప్లాన్ చేస్తోంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook