సాలిడ్ అప్డేట్ తో స్టన్నింగ్ అవతార్ లో “పుష్ప” రాజ్..!

Published on Nov 14, 2021 11:13 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప ది రైజ్”. పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం నుంచి చిత్ర యూనిట్ ఇటీవల కాలంలో ఒకదాన్ని మించి ఒకటి సాలిడ్ అప్డేట్ ని ఇస్తూ వస్తున్నారు. ఒకపక్క అదిరే పాటలు మరోపక్క సినిమాలోని పాత్రలను రివీల్ చేస్తూ వస్తున్నారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి నాలుగో పాటకి రంగం సిద్ధం చేశారు. ఈసారి కూడా ఇంకో పక్కా మాస్ నెంబర్ ని సిద్ధం చేస్తున్నట్టుగా టైటిల్ చూస్తేనే అర్ధం అయ్యిపోతుంది. ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ లాంచ్ చేసిన కొత్త పోస్టర్ లో బన్నీ లుక్ వేరే లెవెల్ అని చెప్పాలి.

ముందు రగ్గుడ్ లుక్ కి కాస్త స్టైల్ మరియు రాజసం యాడ్ చేసి దీనిలో చూపించారు. ఓవరాల్ గా ఈ వెర్షన్ బన్నీ సరికొత్తగా అనిపిస్తున్నాడు. ఇక ఈ సాంగ్ ని నవంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సాంగ్ కి దేవి ఎలాంటి ట్యూన్ ఇచ్చాడో తెలియాలి అంటే అప్పుడు వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More