చిరు, బాలయ్యలతో మల్టీ స్టారర్ చేయాలంటున్న యువ దర్శకుడు !
Published on Feb 26, 2018 5:52 pm IST

ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో నాని నిర్మించిన ‘అ !’ కొంత ప్రత్యేకతను సంతరించుకుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఆయన పనితనానికిగాను ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందారాయన. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడ మంచి వసూళ్లను రాబడుతోంది.

ఇకపోతే ఇటీవల జరిగిన ఈ చిత్ర ప్రమోషన్స్ లో మాట్లాడిన ఆయన తనకు మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉందని, అది కూడ మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణలతో చేయాలని కోరికని అన్నారు. మరి ఈ యువ దర్శకుడు తన ఆశను నెరవేర్చుకోడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి.

 
Like us on Facebook