సంవత్సరానికి మూడు సినిమాలు నిర్మిస్తానంటున్న యంగ్ హీరో !
Published on Dec 28, 2016 8:38 am IST

nara-rohith

ఈ సంవత్సరం వరుసగా ‘తుంటరి, సావిత్రి, జ్యో అచ్యుతానంద, రాజా చెయ్యి వేస్తే, శంకర’ వంటి ఐదు సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేసిన యంగ్ హీరో నారా రోహిత్ ఆరవ చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఈ డిసెంబర్ 30న విడుదలకానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన రోహిత్ ‘ఈ సినిమాలో పలు జానర్లు కనిపిస్తాయి. క్రికెట్, నక్సలిజం, ప్రేమ వంటి అంశాలు చాలా ఉన్నాయి. మంచి స్క్రిప్ట్. సినిమా మొత్తం పూర్తయ్యే వరకు తెలీదు ఈ స్క్రిప్ట్ ని సినిమాగా తీయడం ఎంత కష్టమో. సాగర్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు’ అన్నారు.

అలాగే వచ్చే సంవత్సరం తన సొంత బ్యానర్ ‘అరన్ మీడియా వర్క్స్’ లో మూడు సినిమాలు నిర్మిస్తానని కూడా తెలిపారు. 90 ల దశకంలో హైదరాబాద్లోని పాతబస్తీలో వ్యక్తుల నిజ జీవితాల్లో జరిగిన యాదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో తాన్య హాప్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ విష్ణు మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

 
Like us on Facebook