‘జీ తెలుగు’ ఆదివారం డబుల్ హంగామా – ఆడియన్స్ కోసం హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ రెడీ

‘జీ తెలుగు’ ఆదివారం డబుల్ హంగామా – ఆడియన్స్ కోసం హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ రెడీ

Published on Jan 26, 2024 1:02 AM IST

తెలుగు ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్స్తో అలరించే జీ తెలుగు ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమైంది. ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ ఆదివారం అందిస్తోంది. అంతేకాదు, తెలుగు ప్రేక్షకులను బుల్లితెర, వెండితెరపై అలరిస్తున్న తారలు తమ జోడీతో కలిసి జంటగా తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు సూపర్ జోడీ షో షోని కూడా ప్రసారం చేయనుంది జీ తెలుగు.

నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ భగవంత్ కేసరి ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా సూపర్ జోడి ఆదివారం రాత్రి 9 గంటలకు, జీ తెలుగులో ప్రసారం కానున్నాయి. టాలీవుడ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా ప్రారంభం కానున్న సూపర్ జోడీ చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రముఖ యాంకర్ ఉదయభాను రీఎంట్రీతో ప్రారంభం అవుతుంది. ఈ షోకి న్యాయనిర్ణేతలుగా ఎవర్గ్రీన్ నటి మీనా, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ వ్యవహరించనున్నారు. ఈ షోతో మీనా తెలుగు బుల్లితెరపై మొదటిసారి జడ్జిగా అలరించనున్నారు.

రఘు మాస్టర్ కొరియోగ్రఫీ అనుభవం, శ్రీదేవి విజయ్ కుమార్ అందం ఈ షోని మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి. ఇక ఈ షోలో 8 మంది సెలబ్రిటీ జోడీలు తమ అద్భుతమైన ప్రదర్శనలతో హోరాహోరీగా టైటిల్ కోసం పోటీపడనున్నారు. ఆ సెలబ్రిటీ జోడీలు ఎవరనేది తెలియాలంటే ఉత్కంఠభరితమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న సూపర్ జోడి ఎపిక్ ప్రీమియర్ ఎపిసోడ్లు అందరినీ అలరించేందుకు సిద్ధం అయ్యాయి. మొత్తంగా ఈ ఆదివారం అంతులేని వినోదం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ భగవంత్ కేసరి, డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ జోడి మీ జీ తెలుగులో తప్పక చూడండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు