సీఎం వైయస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఐదు రీజియన్ లలో వైసిపి క్యాడర్ మీటింగ్  

సీఎం వైయస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఐదు రీజియన్ లలో వైసిపి క్యాడర్ మీటింగ్  

Published on Jan 11, 2024 9:30 AM IST

రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార వైసిపి పార్టీ ఇప్పటి నుండే గట్టిగా పార్టీ కార్యకలాపాలపై అలానే కార్యకర్తలు, నేతల పై దృష్టి పెట్టింది. ఇక ఆ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఐదు రీజియన్ లలో క్యాడర్ మీటింగ్ లను నిర్వహించి క్యాడర్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు. 

నాలుగు నుండి ఆరు జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పార్టీ సభ్యులందరినీ ఏకంచేసి, వారిలో చైతన్యం నింపుతూ రాబోయే ఎన్నికల్లో 175 /175 సీట్లలో గెలిచేలా వారిని సంసిద్ధం చేయడమే ఈ సమావేశాల యొక్క ముఖ్యమైన లక్ష్యం. మొదటి సమావేశం జనవరి 25 వ తేదీన విశాఖపట్నం, భీమిలిలో జరగనుంది. 

మిగిలిన నాలుగు ప్రాంతాల తేదీలను త్వరలో తెలియజేయడం జరుగుతుంది. మీటింగ్ కు 3లక్షల మంది వస్తారని అంచనా. మొత్తంగా ఎప్పటికప్పుడు పార్టీ అంతర్గత విషయాలు, ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలి అనే దానిపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్, మరొక్కసారి తమ పార్టీ గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు