అంబరాన్నంటిన బిఆర్ అంబేద్కర్ సోషల్ జస్టిస్ విగ్రహావిష్కరణ 

అంబరాన్నంటిన బిఆర్ అంబేద్కర్ సోషల్ జస్టిస్ విగ్రహావిష్కరణ 

Published on Jan 19, 2024 1:02 AM IST

నేడు విజయవాడలో సోషల్ జస్టిస్ కి చిహ్నంగా డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆకాశాన్నంటేలా విజయవాడ నగరం నడిబొడ్డున ఏపీ ప్రభుత్వం నిర్మించిన రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని స్వరాజ్య మైదానంగా పిలిచే పిడబ్ల్యుడి గ్రౌండ్స్‌లో ఏపీ ప్రభుత్వం రూ.404 కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులతో నిర్మించింది. ఈ విగ్రహం యొక్క ఎత్తు 210 అడుగులు. ఇక ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా దాదాపు లక్షమందితో సభ నిర్వహించారు. ఎన్నెన్నో ప్రాంతాల నుండి ప్రజలు విశేషంగా తరలి రావడంతో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. 

విజయవాడ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం నిలువనుంది. 85 అడుగల పీఠంపై నిర్మించిన విగ్రహం మొత్తం 210 అడుగుల ఎత్తున నగరం నలుదిక్కులా కనిపించనుంది. ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టింది. దీని కోసం 18ఎకరాల ఇరిగేషన్ స్థలాన్ని ఆ శాఖకు బదలాయించారు. స్మృతి వనం నిర్మాణాన్ని AP ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇక ఇందులో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. 

ముందుగా స్మృతి వనంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, రెండువేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాటర్‌బాడీస్, మ్యూజికల్ ఫౌంటెన్, లాంగ్ వాక్‌ వేస్‌తో డిజైన్ అసోసియేట్స్ తీర్చిదిద్దింది. విజయవాడకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కి ఇది అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా మారే అవకాశముంది. ఇక ఇక్కడ ఏర్పాటు చేసిన కలర్‌ ఫుల్‌ లేజర్‌ షో ప్రజలను కట్టి పడేస్తోంది. మొత్తంగా భారీ జనసందోహం మధ్యలో ఎంతో వైభవోపేతంగా సోషల్ జస్టిస్ కి చిహ్నంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలివచ్చిన ప్రజలు జోహార్ అంబేద్కర్ నినాదాలతో స్టేడియం మొత్తం హోరెత్తించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు