చంద్రబాబు పై నార్నె శ్రీనివాసరావు సంచలన కామెంట్స్

చంద్రబాబు పై నార్నె శ్రీనివాసరావు సంచలన కామెంట్స్

Published on Apr 22, 2024 3:05 PM IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే కోరిక తో అటు జనసేన, ఇటు బిజెపిలతో కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వస్తున్నారని ఇప్పటికే పలువురు వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక బాబు అధికారం కోసం ఎటువంటి పనికి అయినా దిగజారుతారని, అలానే తన సొంత తమ్ముడికి టికెట్ ఇవ్వకుండా అతడిని నానా ఇబ్బందులకు గురిచేశారని నార్నె శ్రీనివాసరావు కి సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియో లో శ్రీనివాసరావు మాట్లాడుతూ బాబు అసలు నమ్మదగిన వ్యక్తి కాదని, తన అవసరం కోసమే ఆయన ఇతర వ్యక్తులని వాడుకుని వదిలేస్తారని అన్నారు. 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు