ఏపీ సీఎంగా జగన్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమంటున్న న్యూస్ అరేనా సర్వే 

ఏపీ సీఎంగా జగన్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమంటున్న న్యూస్ అరేనా సర్వే 

Published on Feb 1, 2024 12:16 AM IST

ఇప్పటికే జరిగిన 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 151 సీట్లతో విజయఢంకా మ్రోగించి దాదాపుగా నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల యొక్క మెప్పుతో ముందుకు కొనసాగుతున్నారు. అలానే రాబోయే తదుపరి అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన సన్నద్ధం అవుతూ ఈసారి మరింతగా విజయం అందుకునేలా వైసిపి కార్యకర్తలు, నాయకులు, క్యాడర్ లో ఎప్పటికప్పుడు జోష్ నింపుతున్నారు. 

ఇక మరోవైపు ఆంధ్ర ప్రజలు మరొక్కసారి ఆయనకు అధికారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారనడానికి సాక్ష్యంగా ఇటీవల జరిగిన పలు సర్వేల నివేదికలు తేల్చాయి. విషయం ఏమిటంటే, తాజాగా న్యూస్ అరేనా ఇండియా వారు ఆంధ్రలోని పలు జిల్లాల్లో కొందరు ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించి చేపట్టిన సర్వేలో కూడా వైసిపికి మెజారిటీ మద్దతు లభించింది. 

ఇక వారు సేకరించిన సర్వే వివరాల ప్రకారం వైసిపి కి 49% వోటింగ్ తో 122 సీట్లు లభించనుండగా, టిడిపి జనసేన అలయన్స్ కు 44. 34 % వోటింగ్ తో 53 సీట్లు, బిజెపి కి 0. 56% వోటింగ్, కాంగ్రెస్ కి 1. 21 వోటింగ్, ఇతరులకు 4. 75 వోటింగ్ లభించే ఛాన్స్ ఉందని ఫలితాలు వెల్లడించాయి. కాగా దీనిని బట్టి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం గట్టిగా కనపడుతోంది. అలానే వైసిపి నాయకులు కూడా ప్రజలు తమవైపు ఉన్నారని, రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్ వారు ప్రమాణస్వీకారం చేయడం తథ్యం అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు