వాలంటీర్ వ్యవస్థ పై టిడిపి కుట్రపూరిత చర్య

వాలంటీర్ వ్యవస్థ పై టిడిపి కుట్రపూరిత చర్య

Published on Mar 31, 2024 2:46 PM IST

రానున్న ఏపీ ఎన్నికల కోసం ఇప్పటికే పలు పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యాయి. ఇక మరొక్కసారి అధికారాన్ని అందుకునేందుకు వైసిపి అధినేత జగన్ కూడా ప్రజల్లోకి వెళుతూ ఎప్పటికప్పుడు వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే ఈసారి ఎలాగైనా అధికారాన్ని అందుకోవాలనే ఆలోచనతో గత వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ పై విషం చిమ్మిన టిడిపి పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల ద్వారా వైసిపి ప్రచారం నిర్వహిస్తోంది అంటూ ఈసీ ద్వారా వారి పనులని నిలుపుదల చేయించారు. దానితో ప్రతినెలా పెన్షన్లు తీసుకునే అవ్వా తాతలకు అన్నివిధాలా ఈ నెల నుండి ఇబ్బందులు తప్పడం లేదు.

భళ్ళున తెల్లారింది ఫస్ట్ వచ్చింది ఎప్పట్లానే గుమ్మం ముందు నవ్వుతూ నిలబడి తాతా పెన్షన్ తీసుకో అవ్వా వేలిముద్ర వేద్దువురా అని పిలిచే వాలంటీర్ లేడు రాలేదు. ఆ విధంగా ఇంటింటికి వెళ్లి సేవలు అందిస్తున్న వాలంటీర్ల కాళ్లకు చంద్రబాబు సంకెళ్లు వేసారు. వాళ్ళు పెన్షన్లు ఇవ్వొద్దని పిటిషన్ వేయడంతో ఆ పెన్షన్ల పంపిణీ ఆగిపోయింది. దీంతో ఈరోజు పెన్షనర్లకు నిరాశ మిగిలింది. ఇప్పుడు ఎండల్లో ఆ అవ్వాతాతలు వికలాంగులు సైతం సచివాలయం వద్ద కాపు కాయాలి. దీంతో పాటు రేషన్ సరుకులు కూడా ఇళ్లవద్ద ఇవ్వొద్దని అడ్డుకోవడంతో బియ్యం కోసం ప్రజలు రేషన్ డిపోల వద్ద గుమిగూడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు