సమీక్ష : దేవదాస్ – సరదాగా సాగిపోయే కామెడీ డ్రామా

Devadas movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 27, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : నాగార్జున, నాని, రష్మిక, ఆకాంక్ష సింగ్

దర్శకత్వం : శ్రీ రామ్ ఆదిత్య

నిర్మాతల : అశ్వినీదత్

సంగీతం : మణిశర్మ

ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా వుందో ఇప్పుడు చూద్దాం..
కథ :

దేవా (నాగార్జున) అండర్ వరల్డ్ డాన్ గా ఎవరికి కనిపించకుండా చలామణి అవుతుంటాడు. ఈ క్రమంలో ఆయన గురువు అయిన శరత్ కుమార్ ను డేవిడ్ గ్యాంగ్ చంపేస్తుంది. ఆయనను చంపిందే ఎవరో కనుక్కోవడానికి హైదరాబాద్ వస్తాడు దేవా. ఇక ఒకానొక సందర్భంలో డాక్టర్ దాస్ (నాని ) ను కలుసుకుంటాడు. ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. ఆ తరువాత డాన్ అయిన దేవా, డేవిడ్ గ్యాంగ్ ను ఏం చేశాడు? దేవాను దాస్ మంచి మనిషిగా ఎలా మార్చాడు అన్నదే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :

సినిమాకు నాగ్ ,నాని ఇద్దరు చాలా ప్లస్ అయ్యారు. దేవా పాత్రలోనాగ్ లుక్స్ బాగున్నాయి. ఫ్రెష్ లుక్ తో ఎనర్జిటిక్ గా నటిస్తూ ఆకట్టుకున్నాడు. ఇక దాస్ పాత్రలో నాని అదరగొట్టాడు. అమాయకపు డాక్టర్ పాత్రలో తన సహజ నటనతో తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. సినిమా ని ఈ ఇద్దరు తమ భుజాల మీద వేసుకొని నడిపించారు.

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే పూజ పాత్రలో రష్మిక, జాహ్నవి పాత్రలో ఆకాంక్ష సింగ్ గ్లామర్ గా కనిపిస్తూ తమ పాత్రల పరిధి మేర నటించారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ వున్నది కాసేపైనా తన నటనతో మెప్పించాడు. సీనియర్ నరేష్ , మురళి శర్మ, నవీన్ చంద్ర ఎప్పటిలాగే తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

ఇక దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య నాగ్ , నాని ల మధ్య బలమైన ఎమోషన్స్ సన్నివేశాలను తెర మీద బాగా చూపించగలిగాడు. కామెడీ తో పాటు చిన్న మెసేజ్ ను ఇస్తూ సినిమా ను రూపొందిచాడు. ఇక సినిమాలో వచ్చే గోల్డ్ మెడల్ అంటే ఆర్నమెంట్ కాదు అచీవ్ మెంట్ లాంటి డైలాగ్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :

కామెడీ తో కూడిన సందేశాత్మకమైన సినిమాను ప్రేక్షకులకు అందించాలనుకొని ఈ కథను రాసుకున్న శ్రీ రామ్ ఆదిత్య దాన్ని పూర్తి స్థాయిలో తెరమీదకు తీసుకురాలేకపోయాడు. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో మొదటి 20 నిమిషాలు బోర్ కొట్టించాడు. నాగార్జున వచ్చాక కానీ స్టోరీ లో వేగం రాదు. ఇక సినిమాలో చాల సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపించాయి. నాగ్, నాని పాత్రలతో ఇంకా కామెడీ అందించే స్కోప్ వున్నా దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయాడు.

నాగ్ – ఆకాంక్ష , నాని – రష్మికల లవ్ ట్రాక్ ఫై ఇంకొంచెం దృష్టి పెడితే బాగుండేది. ఇక బలమైన స్టోరీ లేకపోవడం వల్ల సినిమాలో వచ్చే ట్విస్టులు కూడా ఆసక్తిగా అనిపించవు. ఫస్ట్ హాఫ్ లో వేగం పెంచి బలమైన కంటెంట్ తో ఇంకొంచెం కామెడీ డోస్ పెంచి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే. ఇక ఇద్దరు స్టార్ హీరోలు వున్నా వారిని పూర్తి స్థాయిలో వాడుకోవడంలో కూడా శ్రీ రామ్ ఆదిత్య వైఫల్యం చెందాడు.
సాంకేతిక వర్గం :
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టింది. శ్రీరామ్ ఆదిత్య ఒక మంచి సినిమాను అందించాలని ఈ కథను రాసుకున్నాడు . కానీ దాన్ని పూర్తి స్థాయిలో తెరమీదకు తీసుకరాలేకపోయాడు. కామెడీ , ఎమోషన్స్ ను బాగానే డీల్ చేయగలిగాడు కానీ బలమైన కంటెంట్ వున్నా కథ ను రాసుకోలేకపోయాడు. ఈసినిమాకు మణిశర్మ అందించిన సంగీతం పర్వాలేదు. సినిమాలో రెండు పాటలు బాగున్నాయి. ఇక నేపథ్య సంగీతం అందిచడంలో దిట్టయినా మణిశర్మ ఈచిత్రానికి ఆర్డినరీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చి సరిపెట్టుకున్నాడు.

శ్యామ్ దత్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమాకు కు రిచ్ లుక్ తీసుకరావడంలో ఆయన విజయం సాధించాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడి అనవసరమైన సన్నివేశాలను తొలిగిస్తే బాగుండేది.
తీర్పు :

కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కామెడీతో పాటు బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. కాకపొతే బలమైన కథ లేకపోవడం, కథనం ఆసక్తికరంగా సాగకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కానీ నాగార్జున, నానిలు తమ నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు.. వారి మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ మరియు ఎమోషనల్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి. ఓవరాల్ గా ఈ చిత్రం వైవిధ్యమైన చిత్రాలు కోరుకొనే వారికి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు గాని, సగటు ప్రేక్షకుడిని మాత్రం ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :