సమీక్ష : క్షణ క్షణం – ఆకట్టుకోని థ్రిల్లర్ డ్రామా

విడుదల తేదీ: ఫిబ్రవరి 26, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : ఉదయ్ శంకర్, జియా శర్మ, రఘు కుంచె, రవి ప్రకాశ్, శృతి సింగ్, కోటి

దర్శకత్వం : కార్తీక్ మేడికొండ

నిర్మాత‌లు : డా. వర్లు, డా. మన్నం చంద్రమౌళి

సంగీతం : రోషన్ సలూర్

సినిమాటోగ్రఫీ : సిద్ధార్ధ కరుమూరి

ఎడిటింగ్ : గోవింద్ దిట్టకవి

యంగ్ హీరో ఉదయ్ శంకర్ మరియు అర్జున్ రెడ్డి హీరోయిన్ జియా శర్మలు నటించిన కొత్త చిత్రం “క్షణ క్షణం” ఈ రోజు విడుదలైంది. కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో మన మూవీస్ బ్యానర్‌లో డాక్టర్ వర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన డిస్ట్రిబ్యూషన్ వింగ్ ‘గీతా ఫిల్మ్స్’ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే మొదటి నుంచి ఈ చిత్రంపై అందరిలోనూ ఎంతో ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి.

 

కథ:

 

కథలోకి వెళ్ళినట్టయితే సత్య (ఉదయ్ శంకర్) ఓ అనాధ. అతను ప్రీతి (జియా శర్మ) అనే మరో అనాధను వివాహం చేసుకుని అందమైన సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే ప్రీతి కాస్త మనీ మైండెడ్ అమ్మాయి. సత్య తెస్తున్న సంపాదన పట్ల ఆమె సంతోషంగా లేదు. అయితే ఈ కారణం చేత ఒకరికొకరు విడాకులు తీసుకునేందుకు ఆలోచిస్తారు.

ఈ తరుణంలో సత్య తన ఫిషింగ్ వ్యాపారంలో భారీగా నష్టపోతాడు. అతను చేసిన అప్పులు పెరిగి మీదపడుతుండంతో వాటి నుంచి బయటపడేందుకు అతను డేటింగ్ యాప్ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ ప్రక్రియలో అతనికి మాయ (శ్రుతి సింగ్) అనే ఓ వివాహితతో స్నేహం ఏర్పడుతుంది. అయితే సత్యపై మోహంతో ఓ రాత్రి ఆమె అతడిని తన ఇంటికి ఆహ్వానిస్తుంది.

అయితే ఆ రాత్రి మాయ ఇంటికి వచ్చిన సత్యకు మాయ చనిపోయి కనిపిస్తుంది. వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇస్తాడు. అయితే అక్కడకు వచ్చిన ఎస్ఐ కృష్ణ మనోహర్ (రవి ప్రకాష్) సత్యను అనుమానించి దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఈ నేపధ్యంలో అసలు సత్య జైలు శిక్ష అనుభవిస్తారా లేదా కేసు నుండి బయటకు వస్తారా? అతని వివాహం మనుగడ సాగిస్తుందా లేదా విడాకులతో ముగుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమాను వెండి తెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 
హీరో ఉదయ్ శంకర్ ఓ ఊహించని మర్డర్ కేసులో చిక్కుకుని ఏమీ చేయలేని నిస్సాహాయుడిగా అతను కనబరిచిన నటన చాలా అద్భుతంగా ఉంది. అర్జున్ రెడ్డి అమ్మాయి జియా శర్మను చాలా కాలం తరువాత పూర్తి స్థాయి పాత్రలో చూడటం బాగుంది. ఇక ఆమె పాత్రకు సెకాండాఫ్‌లో మంచి ప్రాముఖ్యత లభించింది.

క్లైమాక్స్ ట్విస్ట్ సినిమా యొక్క ప్రధాన టాకింగ్ పాయింట్. రవి ప్రకాష్ మరియు రఘు కుంచెతో సహా మిగిలిన నటులు వారి పాత్రలలో చాలా చక్కగా నటించారు. ఇక ప్రముఖ సంగీత స్వరకర్త కోటి ఈ చిత్రంతో న్యాయవాది పాత్రలో నటించారు. అతను కూడా మంచి స్క్రీన్ ప్లే కనబరిచారు.

 

మైనస్ పాయింట్స్:

 

కథాంశం సాధారణమైనప్పటికీ, పేలవమైన కథనం అనుభవాన్ని చాలా వరకు పాడు చేసింది. హీరో యొక్క వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలను చూపించేందుకు ఎక్కువ సమయం కేటాయించినందున ఫస్టాఫ్ నెమ్మదిగా సాగుతుంది. పాటలు స్పీడ్ బ్రేకర్ల మాదిరిగా అనిపించాయి. ప్రధాన నటులు సెకాండాఫ్ మధ్యలో కనిపించడం సిల్లీగా అనిపించింది.

 

సాంకేతిక వర్గం:

 
ఈ సినిమా కథనం చాలా తక్కువగా ఉంది మరియు తరచుగా మీ సహనాన్ని పరీక్షిస్తుంది. కెమెరా పని తగినంతగా ఉన్నప్పటికీ, ఎడిటర్ కాస్త మొదటి భాగంలో కొన్ని అనవసరమైన సన్నివేశాలను సవరించి ఉంటే బాగుండేది. ఇక సంభాషణలు ఎక్కువగా ఉన్నా అది ఎక్కువ ప్రభావం చూపలేకపోయింది. పాటలు యావరేజ్‌గా ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒకే అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో చిత్రీకరించినప్పటికి బిగ్ స్క్రీన్‌పై చూడవచ్చని అనిపిస్తుంది.

 

తీర్పు:

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే “క్షణ క్షణం” థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా సినిమాలో నిమగ్నం చేయడంలో విఫలమయ్యిందనే చెప్పాలి. క్లైమాక్స్ ట్విస్ట్ మినహా, మిగతా చిత్రం కొత్తగా, ఆకట్టుకునేలా అనిపించలేదు. అయితే సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా, యువ బృందాన్ని ప్రోత్సహించడానికి, సాధారణ థ్రిల్లర్ సినిమాలను ఇస్టపడే వారికి ఈ సినిమా ఓ ఛాయిస్‌గా నిలుస్తుంది.

123telugu.com Rating :  2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :