సమీక్ష : మట్టి కథ – కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి

సమీక్ష : మట్టి కథ – కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి

Published on Sep 23, 2023 3:02 AM IST
Matti Katha Movie Review In Telugu

విడుదల తేదీ :సెప్టెంబర్ 22, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అజయ్ వేద్, మాయ, కనకవ్వ, దయానంద్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బల్వీర్ సింగ్, అక్షయ్ సాయి, రాజు ఆలూరి, రుచిత, బత్తుల తేజ మరియు ఇతరులు.

దర్శకుడు : పవన్ కడియాల

నిర్మాత: అప్పి రెడ్డి

సంగీతం: స్మరన్ సాయి

సినిమాటోగ్రఫీ: సాయినాథ్

ఎడిటర్: ఉదయ్ కుంభం, రామకృష్ణ

సంబంధిత లింక్స్: ట్రైలర్

పవన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ స్మాల్ బడ్జెట్ మూవీ మట్టికథ. అందరూ కొత్తవారితో తెరకెక్కిన ఈ మూవీ నేడు థియేటర్స్ లో రిలీజ్ అయి ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ప్రస్తుతం దీని యొక్క పూర్తి సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

హైదరాబాద్ కి దగ్గర్లో గల ఒక పల్లెటూరులో నలుగురు కాలేజీ చదువుకునే స్టూడెంట్స్ భూమయ్య (అజయ్ వేద్), శ్రీను (అక్షయ్ సాయి), యాదగిరి (రాజు ఆలూరి), రాజు (బత్తుల తేజ) ఉంటారు. యాదగిరి తప్ప మిగతా ముగ్గురూ కూడా భవిష్యత్తు పై ఏ మాత్రం భయం లేకుండా హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే వారిలో భూమయ్య, రాజి (మాయ) ని ప్రేమిస్తాడు. అయితే ఆమె పల్లెటూరి లోనే ఉండడం అతడికి నచ్చదు. మరోవైపు ఆ పల్లెటూరిలో కొందరి భూములు ఆక్రమణలకు గురవుతుంటాయి. అయితే వాటిలో ఒక ఇన్సిడెంట్ భూమయ్య జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. ఇంతకీ అది ఏమిటి, తరువాత భూమయ్య ఏమి చేసాడు అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

మట్టికథ చాలా వరకు స్వచ్ఛమైన గ్రామీణ కామెడీ, ఆకట్టుకునే సంగీతంతో సాగుతుంది. ఇక సినిమాలో గ్రామీణ వాతావరణం, అక్కడి జీవనం, ఫోక్ సాంగ్స్ వంటివి మనల్ని ఎంతో అలరిస్తాయి. ఇక స్టూడెంట్స్ మధ్య జరిగే సీన్స్ ఎంతో ఎంటర్టైన్మెంట్ తో సాగడంతో పాటు ఆడియన్స్ కి కొంత గిలిగింతలు పెడతాయి. ఫస్ట్ ఫిలిం అయినప్పటికీ కూడా మట్టి కథలో ప్రధాన పాత్ర చేసిన అజయ్ వేద్ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా భూమయ్య గా అతడు పండించిన ఎమోషన్స్ మరింత బాగున్నాయి. అక్షయ్ సాయి, రాజు ఆలూరి, బత్తుల తేజ, రుచిత, బల్వీర్ సింగ్, మరియు మాయ తమ పాత్రలలో చక్కగా నటించారు. ఇక హీరో యొక్క నానమ్మ పాత్ర చేసిన కనకవ్వ రజాకార్ల జీవితం గురించి చెప్పే సీన్ ఎంతో ఆకట్టుకుంటుంది. వారి నలుగురిలో ఒకరు ఫీజు కట్టలేక కాలేజీ మానేసే సన్నివేశాలు కంట నీరు తెప్పిస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఒక ఘటన హీరో యొక్క లైఫ్ ని మొత్తం మార్చేస్తుంది. అక్కడి నుండి చివరి వరకు సినిమా చాలా సీరియస్ నోట్ లో సాగుతుంది. అయితే మంచి క్లైమాక్స్ ఉంటుందని అందరం ఆశిస్తాం కానీ మూవీ మాత్రం ఒక సోషల్ మేసేజ్ తో హఠాత్తుగా ముగుస్తుంది. కాగా ఇది కథని అసంతృప్తికరంగా మిగులుస్తుంది. చాలా వరకు సినిమాలు లాంగ్ రన్ టైంలో సాగుతాయి కాని ఈ మూవీ మాత్రం తక్కువ రన్ టైంలో సాగుతుంది. కథ, కథనాల్ని సులువుగా ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ తక్కువ టైం ఉండేలా ప్లాన్ చేశారనిపిస్తుంది. అయితే దీని పై మిశ్రమ స్పందన లభించే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి మరియు కథ ఆడియన్స్ కి కనెక్ట్ అవడానికి టైం పడుతుంది. సినిమా సగం పూర్తి అవగానే ఆడియన్స్ కొంత కనెక్ట్ అవుతారు. మాస్ అంశాలు లేకపోవడం దీనికి ఒకింత మైనస్.

 

సాంకేతిక వర్గం :

మ్యూజిక్ డైరెక్టర్ స్మరన్ సాయి అందించిన సాంగ్స్ బాగున్నాయి, ముఖ్యంగా కనకవ్వ క్యారెక్టర్ కి వచ్చే సాంగ్ ఎంతో బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. ఇక సాయినాథ్ అందించిన విజువల్స్ కూడా బాగున్నాయి. కానీ ఎడిటింగ్ విభాగం వారు మాత్రం మరింత బాగా పనిచేస్తే బాగుండేది. బడ్జెట్ తక్కువ అయినా కథని బాగానే చూపించారు. దర్శకుడు పవన్ కడియాల కొత్త నటుల నుండి మంచి పెర్ఫార్మన్స్ రాబట్టారు. అయితే కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్త తీసుకుంటే అతడికి మంచి భవిష్యత్తు లభిస్తుంది.

 

తీర్పు :

మొత్తంగా మట్టి కథ అనేది ఆకట్టుకునే రీతిన సాగే గ్రామీణ కథ. నటీనటుల పెర్ఫార్మన్స్ లు బాగుంటాయి. మెల్లగా ప్రారంభం అయినా కొన్ని సీన్స్ అనంతరం ఆకట్టుకుంటుంది, అలానే కామెడీ, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అయితే హఠాత్తుగా వచ్చే క్లైమాక్స్ ఆకట్టుకోదు. కమర్షియల్ సరైనవి లేకపోవడం వలన ఇది అన్నివర్గాల వారిని అలరించే ఛాన్స్ లేదు. అయితే గ్రామీణ కథలను చూసేవారికి ఇది బాగానే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు