సమీక్ష : నేనొస్తా – విసిగించి వదిలిన సైకో థ్రిల్లర్ !

Nenostha review

విడుదల తేదీ : డిసెంబర్ 30, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : పరంధ్‌ కళ్యాణ్‌

నిర్మాత : బాషా మజహర్‌

సంగీతం : అనురాగ్‌ వినీల్‌

నటీనటులు : జ్ఞాన్‌, సూర్య శ్రీనివాస్‌, ప్రియాంక పల్లవి

మంచి కంటెంట్ తో వచ్చే చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాదిస్తుండటంతో అదే దారిలో కథా కథనాలను నమ్ముకుని వస్తున్న చిత్రమే ‘నేనొస్తా’. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు పరంధ్‌ కళ్యాణ్‌ డైరెక్ట్ చేశాడు. మరి ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

అప్పటికే ప్రేమలో ఉన్న చేతన్, నయన్ (ప్రియాంక పల్లవి) లు తమ మధ్య అనవసరంగా తలెత్తిన మనస్పర్థలు దూరం చేసుకుని ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేందుకు 5 రోజులు ఎక్కడికైనా ట్రిప్ కు వెళ్లాలని బయలుదేరతారు. అలా హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లకు మధ్యలో ఒక వ్యక్తి పరిచమై వాళ్ళతో పాటే జర్నీలో చేరతాడు.

అలా తమతో చేరిన ఆ అజ్ఞాత వ్యక్తి ఒక సైకో అని కొద్దిసేపటికే వాళ్లకు అర్థమై అతన్ని వదిలించుకుంటారు. కానీ ఆ సైకో మాత్రం వాళ్ళను వదలడు. అసలు ఆ సైకో ఎవరు ? అతను పర్టిక్యులర్ గా చేతన్, నయన్ లనే ఎందుకు ఫాలో అవుతున్నాడు ? అతని ఎంట్రీతో ఆ ప్రేమికుల జీవితాలు ఏమయ్యాయి ? అనేదే ఈ సినిమా…

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్లస్ పాయింట్స్ కొస్తే ముందుగా చెప్పుకోవలసింది కథ గురించి. దర్శకుడు పరంధ్‌ కళ్యాణ్‌ థ్రిల్లర్ జానర్ కు సరిగ్గా సరిపోయేట్టు ఒక రొమాంటిక్ స్టోరీని సైకో చుట్టూ రాసుకున్న స్టోరీ లైన్ గురించి. మొదట ప్రేమ కథగా మొదలైన ఈ చిత్రం వెంటనే థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఆసక్తికరంగా మారుతుంది. సైకో ప్రేమ జంటను అప్రోచ్ అవడం, అతనిలోని శాడిజాన్ని చూపడం వంటి కొన్ని సన్నివేశాలు బాగున్నాయి.

అలాగే కథలో ముఖ్యమైన సైకో పాత్రకు రాసిన బ్యాక్ డ్రాప్ ఆసక్తికరంగా ఉంది. సమాజంలో పిల్లపై జరుగుతున్న అకృత్యాలను బేస్ చేసుకుని ఆ సైకో పాత్రను తీర్చిదిద్దడం, మెసేజ్ ఇవ్వడం బాగుంది. సెకండాఫ్ లో సైకో చేతిలో చిక్కి ప్రేమ జంట పూర్తిగా కష్టాల్లో పడటం అనే బ్లాక్ బాగుంది. ఇంటర్వెల్ లో హీరోయిన్ మాయమవడం అనే బ్యాంగ్ కాస్త ఆసక్తిని కలుగజేసింది.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ కొస్తే దర్శకుడు, రచయిత అయిన పరంధ్‌ కళ్యాణ్‌ రొమాంటిక్ థ్రిల్లర్ కు కావాల్సిన మంచి స్టోరీ లైన్ ను అయితే ఎంచుకున్నాడు కానీ అందులో ఒక మంచి సినిమాను తీయడానికి కావాల్సిన ఇతర అంశాలను సిద్ధం చేసుకుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. థ్రిల్లర్ అంటే కథనం చాలా వేగంగా ఉండాలి, అందులో వచ్చే ప్రతి మలుపు ఆసక్తికరంగా, ఊహించని విధంగా ఉండాలి కానీ ఇందులో అసలైన ఆ అంశాలే మిస్సయ్యాయి. చాలా సన్నివేశాలు రొటీన్ గా, ముందుగానే వహించే విధంగా ఉన్నాయి. సినిమా ప్రారంభం మినహాయిస్తే కథనంలో ఎక్కడా పట్టు కనబడలేదు. సైకో ప్రతి సన్నివేశంలో కనిపిస్తూ రొటీన్ గా మారిపోయాడు.

కాసేపటికి ఆ సైకో పాత్రను చూస్తే ఏదో మామూలు రౌడీని చూస్తున్నట్టు అనిపించిందే తప్ప ఎక్కడా టెంక్షన్, ఆసక్తి కలగలేదు. అలాగే హీరో హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ చాలా చోట్ల అసహజంగా అనిపించింది. హీరో నటన పర్వాలేదు కానీ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కాస్త మొహమాట పెట్టిందనే చెప్పాలి. ఇక సెకండాఫ్ లో కథ క్లైమాక్స్ కు వచ్చేస్తుందిలే అనుకునే సమయానికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ స్టార్టడం మరింత విసుగు పెట్టింది. మధ్యలో వచ్చే పాటలు కూడా బోరింగానే ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

టెక్నీకల్ డిపార్ట్మెంట్ చర్చకు వస్తే రచయితగా, దర్శకుడిగా వ్యవహారించిన పరంధ్‌ కళ్యాణ్‌ మంచి స్టోరీ లైన్ తీసుకున్నా దానికి తగ్గ కథనం, దాన్ని ఆసక్తికరంగా స్క్రీన్ పైకి చేర్చడంలో చాలా వరకూ విఫలమయ్యాడు. ఇక అనురాగ్‌ వినీల్‌ సంగీతం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. శివారెడ్డి కెమెరా పనితనం, ఎస్‌ జె.శివకిరణ్‌ ఎడిటింగ్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. బాషా మజహర్‌ నిర్మాణ విలువలు పరవాలేదనిపించాయి.

తీర్పు :

రొమాంటిక్ థ్రిల్లర్ అదీ సైకో నైపథ్యంలో రూపొందిన సినిమా అంటే ప్రేక్షకులకు ఆద్యంతం థ్రిల్స్ ను అందిస్తూ సాగాలి. కానీ ఈ సినిమా ఆ విషయంలో విఫలమైంది. కాస్త బాగుండే స్టోరీ లైన్, అక్కడక్కడా థ్రిల్స్, ఇంటర్వెల్ సీన్ ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా బలహీనమైన కథనం, ఎక్కడా ఆకట్టుకోని పాత్రల నటన, బోర్ కొట్టించే అనవసరపు సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఈ సినిమా సైకో థ్రిల్లర్ జానర్ ను ఇష్టపడుతూ బోరింగ్ కథనాన్ని తట్టుకునే ప్రేక్షకులకు కాస్తో కూస్తో నచ్చుతుందేమో కానీ రెగ్యులర్ ఆడియన్సుకు మాత్రం అస్సలు నచ్చదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :