ఓటిటి సమీక్ష : పాపం పసివాడు – ఆహాలో తెలుగు వెబ్ సిరీస్

ఓటిటి సమీక్ష : పాపం పసివాడు – ఆహాలో తెలుగు వెబ్ సిరీస్

Published on Sep 30, 2023 3:01 AM IST
Peddha Kapu 1 Review In Telugu

విడుదల తేదీ :సెప్టెంబర్ 29, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: శ్రీరామ చంద్ర, రాశి సింగ్, శ్రీ విద్యా మహర్షి, గాయత్రీ చాగంటి, మదీ, అశోక్ కుమార్ తదితరులు

దర్శకుడు : లలిత్ కుమార్

నిర్మాత: అఖిలేష్ వర్ధన్

సంగీతం: జోస్ జిమ్మీ

సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి

ఎడిటర్: విప్లవ్ నిషాదం

సంబంధిత లింక్స్: ట్రైలర్

ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన పాపం పసివాడు (సీజన్ 1) వెబ్ సిరీస్ నేడు అహలో రిలీజ్ అయ్యింది. ఇది సింగర్ శ్రీ రామ చంద్ర కి తొలి ఓటిటి సిరీస్. ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

క్రాంతి (శ్రీరామ చంద్ర), 32 ఏళ్ల వయసు కలిగిన కన్ఫ్యూజ్డ్ పర్సన్. డింపీ (గాయత్రి చాగంటి)తో బ్రేక్ అప్ అయిన తర్వాత డైలమాలో ఉంటాడు. ఒక రాత్రి మనసు బాగొలేనప్పుడు, మత్తులో ఉన్నప్పుడు, అతను ఒక బార్‌లో చారు (రాశి సింగ్)ని కలుసుకుంటాడు. ఆమె ప్లేస్ లో స్టే చేస్తాడు. ఇది అతని లైఫ్ లో కొత్త అనుభూతిని ఇస్తుంది. అదే సమయంలో అతని తల్లిదండ్రులు అనూష (శ్రీ విద్యా మహర్షి)తో అతని వివాహాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో క్రాంతి చారు, అనూషను ఎంచుకోవాలా? లేదా డింపీతో తిరిగి రిలేషన్ కలుపుకోవాలా అని ఆలోచనలో ఉంటాడు. ఈ నిర్ణయం తీసుకోవడంలో అతని ప్రయాణాన్ని, ఆ తర్వాత జరిగే సంఘటనలను సిరీస్ లో చూపించడం జరిగింది.

 

ప్లస్ పాయింట్స్:

క్రాంతి పాత్రకు సింగర్ శ్రీరామ చంద్ర కరెక్ట్ గా సెట్ అయ్యాడు. అతని నటన బాగుంది. ఒక కన్ఫ్యూజ్డ్ పర్సన్ గా బాగా నటించాడు.

చారు పాత్రలో రాశి సింగ్ చాలా బాగా ఆకట్టుకుంది. ఇచ్చిన పాత్రకి న్యాయం చేసింది. అలాగే శ్రీ విద్యా మహర్షి రోల్ ఆకట్టుకుంటుంది.

జోస్ జిమ్మీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిరీస్ కి చాలా ప్లస్ అయ్యింది. సన్నివేశాలను చాలా బాగా ఆకట్టుకొనే విధంగా మ్యూజిక్ ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య రాజీవ్ డిజైన్ చేసిన దుస్తులతో సిరీస్‌ కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. తన బెస్ట్ వర్క్ సిరీస్ కి ప్లస్ అయ్యింది.

 

మైనస్ పాయింట్స్:

దర్శకుడు లలిత్ కుమార్ ఫస్ట్ ఎపిసోడ్‌లో కథను చాలా ఎఫెక్టివ్ గా స్టార్ట్ చేశాడు. అయితే కథనం అదే వేగాన్ని కొనసాగించడానికి చాలా కష్టపడ్డాడు. ఈ ఎఫెక్ట్ మూడవ ఎపిసోడ్‌లో ఈజీగా అర్దం అవుతుంది. గజిబిజి స్క్రీన్ ప్లే తో అంత ఆసక్తికరంగా సాగదు.

క్రాంతి పాత్ర బాగా డిజైన్ చేసినప్పటికీ, దర్శకుడు ఫీమేల్ లీడ్ ల పాత్రల కోసం అంతగా వర్క్ చేయలేదు. స్క్రీన్ పై వారి ప్రెజెన్స్ అంతగా ఆకట్టుకోదు. అంతేకాక శ్రీ రామ చంద్ర, లేడీ లీడ్ ల మధ్యన చెప్పుకోదగ్గ బెస్ట్ సీన్స్ ఏమీ లేవు.

సిరీస్ లో నటించిన ఇతర నటీనటులు లిమిటెడ్ ప్రెజెన్స్ తో లిమిటెడ్ పాత్రలను కలిగి ఉన్నారు. వారి పర్ఫార్మెన్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించదు.

స్టోరీ సింపుల్ గానే ఉన్న, అందులో కావాల్సిన ఫన్ మిస్ అయ్యింది అని చెప్పాలి. మంచి ఫన్ జెనరేట్ చేసే సీన్స్ కి చాలా అవకాశం ఉంది. చివరి ఎపిసోడ్‌ అంతగా ఆకట్టుకోదు. క్లైమాక్స్ కూడా అంత ఆసక్తిగా అనిపించదు.

 

సాంకేతిక విభాగం:

డైరెక్టర్ లలిత్ కుమార్ ఈ వెబ్ సిరీస్ లో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌వర్క్ మరియు కాస్ట్యూమ్స్ వంటి సాంకేతిక అంశాలను చాలా బాగా ఉపయోగించారు. అయితే, పాపం పసివాడు ఒక సింపుల్, ఎంటర్టైనింగ్ సిరీస్ గా మార్చడానికి మరింత మంచి స్క్రీన్‌ప్లే అవసరం. నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌ ఇంకా బెటర్ గా చేసే అవకాశం ఉంది.

 

తీర్పు:

మొత్తానికి, పాపం పసివాడు అనేది ఏజ్ కి సంబందించిన వెబ్ సిరీస్, ఇది ఆడియన్స్ ను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. శ్రీరామ చంద్ర నటన బాగానే ఉన్నప్పటికీ, సింపుల్ స్టోరీ, స్లోగా సాగే స్క్రీన్‌ప్లే కారణం గా అంత ఆసక్తిగా అనిపించదు. అక్కడక్కడా కొన్ని కామెడీ సన్నివేశాలు ఉన్నా, పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు