సమీక్ష : వేట – ఆకట్టుకొని పాత తరహా రివేంజ్ డ్రామా

Veta విడుదల తేది : 21 మార్చి 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : అశోక్ ఆలే
నిర్మాత : ప్రవీణ్ బాల
సంగీతం : చక్రి
నటినటులు : శ్రీకాంత్, తరుణ్, జాస్మిన్, మధురిమ

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, లవర్ బాయ్ తరుణ్ లు గతకొంత కాలంగా కెరీర్ లో దీన స్థితిలో వున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ‘వేట’. జాస్మిన్ హీరోయిన్. సి. కళ్యాన్ నిర్మాత. అశోక్ అల్లే దర్శకుడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈరోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దామా

కధ:

జగన్(శ్రీకాంత్) తన తమ్ముడు కార్తీక్(తరుణ్)తో కలిసి తాము దత్తత తీసుకున్న ఇద్దరు అనాధాలతో ఆనందంగా జీవిస్తూ వుంటారు. జగన్ ఆ ఊరిలోనే పెద్ద డాన్ అయిన దేవ్ రాజ్(అజాజ్ ఖాన్) దగ్గర పనిచేస్తూ వుంటాడు

ఒకానొకరోజు దేవ్ రాజ్ ఒక సాఫ్ట్ వేర్ కంపనీ ఓనర్ బెదిరించి వారి షేర్ లను మొత్తం లాక్కుంటాడు. ఈ స్కామ్ ని హీరోలు పెంచుతూ చెల్లెలుగా చూసుకుంటున్న టి.వి జర్నలిస్ట్ అయిన ప్రవలిక(దీప్తి వాజ్ పై) బయటపెడుతుంది

తాను ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో దేవ్ రాజ్ ప్రవలిక, మరియు తన అనాధ తమ్ముడిని దారుణంగా చంపేస్తాడు. దీనితో ఆవేశం రెట్టించిన కార్తీక్ దేవ్ రాజ్ పై పగ తీర్చుకోవడానికి వెళుతుంటే తన తమ్ముడు జగన్ అడ్డుకుంటాడు

కానీ కధ సుఖాంతమయ్యేసరికి దేవ్ రాజ్, అతని తమ్ముళ్ళు చంపబడతారు. వీరిని ఎవరు చంపారు? కార్తీకా లేక జగనా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

ప్లస్ పాయింట్స్

అద్భుతమైన నటనతో శ్రీకాంత్ మనల్ని ఆకట్టుకుంటాడు. అతని హావభావాలు, యాక్షన్ ఎపిసోడ్ లలో తన నటన బాగుంది. తరుణ్ కూడా పరిధి మేరకు బాగానే నటించాడు. టి.వి యాంకర్ గా నటించిన దీప్తీ వాజ్ పై కి ముఖ్య పాత్ర ఇచ్చారు. ఈమె కూడా వున్నంతలో బానే నటించింది. కామెడి బాధ్యతను కృష్ణ భగవాన్ మోసాడు. ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి

మైనస్ పాయింట్స్:

హీరోయిన్ జాస్మిన్ ప్రేక్షకులను ఆకట్టుకోదు. నటన సంగతి పక్కనబెడితే తరుణ్ తో చేసిన రొమాన్స్ కూడా వీక్షకులకు నచ్చదు

సినిమా చాలా నిమ్మదిగా సాగుతుంది. ఎంటర్టైన్మెంట్ మచ్చుక్కి కూడా కనిపించదు. తరుణ్ ప్రేమకధ కేవలం సినిమా నిడివి పెంచడానికే వాడుకున్నారు

రెండవ భాగం నుండి సినిమాలో తరువాత ఏ సీన్ వస్తుందనేది ఈజీగా గెస్ చేసేయచ్చు. పాటలు మెప్పించాకపోగా సినిమా ఫ్లో కు అడ్డంకిగా మిగిలాయి

సాంకేతిక విభాగం

కెమెరా పనితనం పాత తరహా సినిమాలను గుర్తుచేస్తుంది. ఎడిటింగ్ అస్సలు బాలేదు. సినిమాలో చాలా సన్నివేశాలు మధ్యలోనే వదిలేసారు. మొదటి భాగంలో చాలా సన్నివేశాలను కత్తిరించినా మనకు పెద్దగా తేడా కనబడదు

చక్రీ సంగీతం సో సో గా వుంది. ఒక్క పాట కూడా మనకు గుర్తుండదు. నేపధ్య సంగీతం కూడా సినిమాకు ఏమాత్రం సహాయం చేయదు. దర్శకుడు అశోక్ పనితనం కూడా చెప్పుకునే అంత లేదు

తీర్పు:

మొత్తానికి ఈ వేట సినిమా ఆకట్టుకొని రివేంజ్ డ్రామాగా మిగిలి బి, సి సెంటర్ ల సినిమాగా నిలుస్తుంది. అక్కడక్కడా కొన్ని జోక్ లు, ఫైట్ లు తప్ప సినిమాలో విషయం లేదు. శ్రీకాంత్, తరుణ్ లకు మరోసారి నిరాశే ఎదురైందని చెప్పాలి

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

 
Like us on Facebook