‘హనుమాన్ అంశ్’ లాంటి సినిమా ఇప్పుడు అవసరం – దారి తప్పిన యువతపై మైత్రి నిర్మాత!

‘హనుమాన్ అంశ్’ లాంటి సినిమా ఇప్పుడు అవసరం – దారి తప్పిన యువతపై మైత్రి నిర్మాత!

Published on Oct 7, 2026 1:20 PM IST

రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర సంచలన విజయం సాధించిన లేటెస్ట్ సినిమానే హనుమాన్ అంశ్. సౌబినా సత్య ప్రధాన పాత్రలో దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ డివోషనల్ డ్రామా హిందీలో కేవలం 2 కోట్లతో తెరకెక్కి ఏకంగా 420 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ పట్ల కూడా ఎప్పుడు నుంచో మంచి ఆసక్తి నెలకొనగా ఫైనల్ గా ఈ సినిమాని హోంబలే మరియు మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారు తెలుగులో ఈ అక్టోబర్ 9 విడుదలకి తీసుకొస్తున్నారు.

ఇక ఈ సినిమా తెలుగు ప్రెస్ మీట్ లో మైత్రి నిర్మాత రవి టాలీవుడ్ యువతకు క్లాస్ ఇచ్చారు. ప్రెజెంట్ యువత సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అన్నిటినీ మించి ఏ ఐ వాడకం విషయంలో ఎంత దారుణంగా తయారయ్యారో తెలిపారు. ఇలాంటి సమయంలో వారికి హనుమాన్ అంశ్ లాంటి సినిమా అవసరం అని ఈ తరహా సినిమా చూసి అయినా వారి ఆలోచనా ధోరణిలో మార్పు కలగొచ్చని భావించారు. దీనితో తన కామెంట్స్ వైరల్ గా మారాయి.

తాజా వార్తలు