‘రణబాలి’ ట్రైలర్ మొత్తం మార్చబోతుందా!?

‘రణబాలి’ ట్రైలర్ మొత్తం మార్చబోతుందా!?

Published on Oct 7, 2026 2:01 PM IST

టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన అవైటెడ్ హిస్టారికల్ సినిమానే రణబాలి. స్వాతంత్ర్య భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన తెలుగు నేలకు చెందిన సమరయోధుడు రణబాలి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. అయితే సినిమాకి కావాల్సినంత హైప్ గాని బజ్ ఇంకా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా అందుకోవాల్సి ఉంది.

కానీ దీన్ని రేపు రానున్న ట్రైలర్ కట్ అందిస్తుంది అని వినిపిస్తోంది. ఒక సాలిడ్ ట్రైలర్ కట్ తో రణబాలి అంచనాలు మరింత పెంచడం గ్యారెంటీ అట. దీనితో రేపు రానున్న ట్రైలర్ పట్ల అంచనాలు మరింత పెరిగాయి అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అజయ్ అతుల్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే ఈ అక్టోబర్ 16న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

తాజా వార్తలు