గుండు హనుమంతరావు ఇకలేరు !
Published on Feb 19, 2018 8:34 am IST

తెలుగు పరిశ్రమ మరొక నటుడ్ని కోల్పోయింది. సీనియర్ కమెడియన్ గుండు హనుమంతరావుగారు ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో భాదపడుతున్న ఆయన చాలా రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. గత అర్థరాత్రి ఆరోగ్యం బాగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.

కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. 1956 అక్టోబర్ 10న విజయవాడలో జన్మించిన గుండు హనుమంతరావు 18 ఏళ్ల వయసులోనే నాటక రంగంలోకి ప్రవేశించి అనేక ప్రదర్శనలు ఇచ్చి తర్వాత సినిమాల్లోకి వచ్చి 400లకు పైగా చిత్రాల్లో నటించి తన ప్రత్యేకమైన హాస్య సైలితో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. ఈయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో జరగనున్నాయి. ఆయన మృతి పట్ల 123తెలుగు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తోంది.

 
Like us on Facebook