కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (kichha sudeep) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “మార్క్”. దీనికి ముందు మ్యాక్స్ అనే సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ సినిమా కన్నడలో మంచి ఓపెనింగ్స్ ని సాధించింది కానీ తెలుగులో మాత్రం ప్లాప్ గానే మిగిలిపోయింది. అయితే ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మరి ఇందులో నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా. కన్నడ, తెలుగు సహా తమిళ్ మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమాని చూడాలి అనుకునేవారు అందులో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర విలన్ గా నటించాడు. అలాగే షైన్ టామ్ చాకో, విక్రాంత్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సెంథిల్ త్యాగరాజు, అర్జున్ త్యాగరాజు లు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


