అజిత్ సినిమాకి మాసివ్ ఫిగర్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్.!

అజిత్ సినిమాకి మాసివ్ ఫిగర్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్.!

Published on Jan 19, 2024 1:28 AM IST

కోలీవుడ్ థలా అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “విడా ముయార్చి” ని ఎట్టకేలకి చాలా కాలం గ్యాప్ తర్వాత స్టార్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా దర్శకుడు మగిజ్ తిరుమేణి తెరకెక్కిస్తుండగా ఈ సినిమాపై రీసెంట్ గానే మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. ఈ సినిమా తాలూకా ఓటిటి హక్కులని దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టుగా నిన్ననే అఫీషియల్ క్లారిటి ఇచ్చారు.

అయితే ఇందులో ఈ సినిమాకి భారీ ధర వచ్చినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నెట్ ఫ్లిక్స్ వారు ఏకంగా 100 కోట్లు ఇచ్చి హక్కులు సొంతం చేసుకున్నారట. ఇది మాత్రం మాసివ్ ఫిగర్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా కూడా ఒక యాక్షన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు