పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అప్పుడే ?
Published on Nov 20, 2017 7:33 pm IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 25 వ చిత్రం గా ‘అజ్ఞాతవాసి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అభిమానుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకేక్కిస్తున్నాడు త్రివిక్రమ్. అనిరుద్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ కానుంది.

డిసెంబర్ రెండో వారంలో అడియో ఫంక్షన్ అభిమానుల సమక్షంలో భారీగా చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నెల 25 నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ అవుట్ డోర్ లో ప్లాన్ చేసారు. బయటినుండి అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 25 నుండి 30 లోపు ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ అనౌన్స్ చెయ్యవచ్చని తెలుస్తోంది.

 
Like us on Facebook