ఆడియో రివ్యూ : నీకు నాకు డాష్ డాష్ – తేజ మార్కు ఆల్బం


చాలా కాలం గ్యాప్ తరువాత తేజ ‘నీకు నాకు డాష్ డాష్’ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో నిన్న విడుదల కాగా పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1. పాట: బాయ్ బాయ్
సింగర్స్: దీపక్, శరణ్య, గాయత్రి, సింధు
సాహిత్యం: సాయి
హీరో, హీరొయిన్ మరియు వారి ఫ్రెండ్స్ గ్యాంగ్ మధ్య కాలేజ్ లో సరదాగా సాగిపోయే ఇంట్రడక్షన్ సాంగ్. యశ్వంత్ సంగీతం వేగంగా సాగుతూ వెస్ట్రన్ మరియు ఇండియన్ వాయిద్యాల మిక్సింగ్ బావుంది. సింగర్స్ కూడా దాదాపు కొత్త వారు కావడంతో ఫ్రెష్ ఫీల్ వచ్చింది. సాయి అందించిన సాహిత్యం కూడా బావుంది. మొత్తంగా మంచి పాట విన్న ఫీల్ కలుగుతుంది.

 

2. పాట: నువ్వే నేననన
సింగర్స్: యశ్వంత్ నాగ్
సాహిత్యం: ఆనంద్
మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్ సోలోగా పడిన యుగళ గీతం. సంగీత వాయిద్యాలను జాగ్రత్తగా గమనిస్తే సిన్తనైజర్ పెర్క్యుషణ్ ఎక్కువ స్థాయిలో వాడినట్లు తెలుస్తుంది. హీరో తన ప్రియురాలి ఎదుబాటుతో పడుకునే యుగళ గీతం. యశ్వంత్ బాగా పాడాడు. ఆనంద్ సాహిత్యం పర్వాలేదు. రీరికార్డింగ్ ఇంకాస్త బాగా చేసుంటే బావుండేది.

 

3. పాట: చెకుముకి వదన
సింగర్స్: అభిరామ్, లిప్సిక
సాహిత్యం: బాలాజీ
హీరో హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సాంగ్. అభిరామ్ మరియు లిప్సిక ఇద్దరు చాలా బాగా పాడారు. యశ్వంత్ మ్యూజిక్ రొటీన్ గా అనిపించినా టెంపో మాత్రం బావుంది. బాలాజీ సాహిత్యం బావుంది. ప్రేమికుల భావాలు వ్యక్తీకరించే ఈ పాట అంత గొప్ప పాట కాకపోయినా బావుందని మాత్రం అనిపిస్తుంది.

 

4. పాట: నీకోపం
సింగర్స్: నరేష్ అయ్యర్, చిన్మయి
సాహిత్యం: బాలాజీ
ఈ ఆల్బంలో మరో రొమాంటిక్ డ్యూయెట్ పాట. నరేష్ అయ్యర్, చిన్మయి ఇద్దరు అనుభవం ఉన్న సింగర్స్. చిన్మయి అయితే మెలోడి పాటలు పడటంలో తనకి తానే సాటి అనిపించుకుంది. బాలాజీ సాహిత్యం పర్వాలేదు. యశ్వంత్ మ్యూజిక్ కూడా పర్వాలేదు. సినిమాలో టైమింగ్ బట్టి ఈ పాట భవిష్యత్తు ఉంటుంది.

 

5. ఆపకురా
సింగర్స్: ధీరజ్ శ్రుతి
సాహిత్యం: బాలాజీ
సాహిత్యం వింటుంటేనే సినిమాలో ఇది శృంగారభరిత రొమాంటిక్ గీతం అని తెలిసిపోతుంది. వెస్ట్రన్ బీట్స్ తో స్లోగా మొదలవుతుంది. శృతి మత్తెక్కిన గొంతుతో పాడుతూ పాటకి సరైన నయం చేసింది. ధీరజ్ మాత్రం పర్వాలేదనిపించాడు. యశ్వంత్ సంగీతం ఇంకాస్త బావుంటే బావుండేది. తేజ ఈ పాటని తెరపై ఎలా చూపిన్చాబోతున్నాడో వేచి చూడాలి.

 

6. పరుగు పరుగు
సింగర్స్: యశ్వంత్, బాలు
సాహిత్యం: బాలాజీ
సినిమాలో కీలకమైన చేజింగ్ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్లో వచ్చే పాట. తేజ గత సినిమాల్లో ఇలాంటి పాటలు చాలా వచ్చాయి. వాటిల్లో ఆయన మార్కు టేకింగ్ ఉంటుంది. బాలాజీ మరియు యశ్వంత్ ఇద్దరు ఎమోషన్ తో బాగా పాడారు. మ్యూజిక్ అయితే చాలా బావుంది. తేజ ఆయన మార్కు టేకింగ్ తో తీస్తే సినిమాకి బాగా హెల్ప్ అయ్యే పాట.

 

7. డాష్ డాష్
సింగర్స్: యశ్వంత్, కల్పన
సాహిత్యం: ఆనంద్
ఈ ఆల్బంలో వరసలో మొదటగా నిలిచే పాట. ఆనంద్ సాహిత్యంలో కొన్ని డబుల్ మీనింగ్ పదాలు వినపడినా పాట జానపద నేపధ్యంతో ఉండటంతో తప్పదు అనిపిస్తుంది. సింగర్స్ యశ్వంత్ మరియు కల్పన కలిసి పాటని తమ గొంతుతో ప్రాణం పోసారు. జానపద నేపధ్యంతో వాయిద్యాలు కూడా అవే వాడుతూ చాలా బాగా మిక్సింగ్ చేసారు. మొదటిసారి వినగానే అందరికీ నచ్చుతుంది.

 

8. ప్రాణం అని తలచి
సింగర్స్: యశ్వంత్
సాహిత్యం: బాలాజీ
ఇది యశ్వంత్ పడిన బాధాకరమైన యుగళగీతం. బాలాజీ సాహిత్యం పర్వాలేదు. ఈ పాట ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది. చిత్రీకరణ బావుంటేనే సినిమాలో చూడటానికి వీలుంటుంది. లేకపోతే మాత్రం చాలా కష్టం.

 

తీర్పు:

నీకు నాకు డాష్ డాష్ దర్శకుడు తేజ మార్కు ఆల్బం అని చెప్పుకోవాలి. ఒక జానపద పాట మరియు డ్యూయెట్ పాటలు ఆయన గత చిత్రాల్లో కనిపిస్తాయి. యశ్వంత్ సంగీతంలో కొన్ని పాటలు ఆకట్టుకోగా కొన్ని మాత్రం రొటీన్ గా ఉన్నాయి. ఈ ఆల్బం లో ‘డాష్ డాష్’ పాట హైలెట్. మిగతా పాటల్లో బాయ్ బాయ్ మరియు నీ కోపం పాటలు బావున్నాయి. మొదటి సరిగా ఒక సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న యశ్వంత్ సినిమాకు బాగానే హెల్ప్ అయ్యే ఆల్బం ఇచ్చాడు.

అనువాదం : అశోక్ రెడ్డి

Clicke Here For Neeku Naaku Dash Dash Audio Review

సంబంధిత సమాచారం :

More