ఓటీటీ సమీక్ష : 3 రోజెస్ సీజన్ 2 – ఆహాలో తెలుగు వెబ్ సిరీస్ (4 ఎపిసోడ్స్)

ఓటీటీ సమీక్ష : 3 రోజెస్ సీజన్ 2 – ఆహాలో తెలుగు వెబ్ సిరీస్ (4 ఎపిసోడ్స్)

Published on Dec 13, 2025 6:05 PM IST

3 Roses 1

విడుదల తేదీ : డిసెంబర్ 13, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఆహా

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు, సత్య, హర్ష చెముడు, ప్రభాస్ శ్రీను తదితరులు

దర్శకుడు : కిరణ్ కె కరవల్ల
నిర్మాత : ఎస్‌కెఎన్
సంగీత దర్శకుడు : అజయ్ అరసాడ
సినిమాటోగ్రాఫర్ : శక్త అరవింద్
ఎడిటర్ : విజయ్ ముక్తవరపు

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో మంచి విజయాన్ని అందుకున్న ‘3 రోజెస్’ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘3 రోజెస్ సీజన్ 2’ను తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ నాలుగు ఎపిసోడ్స్‌తో నేటి నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత కల్లపు లీడ్ రోల్స్‌లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

రిత్విక అలియాస్ రీతూ(ఈషా రెబ్బా), మేఘన(రాశి సింగ్), స్రష్టి(కుషిత) ముగ్గురు కలిసి నివసిస్తుంటారు. తన భర్తతో విడాకుల తీసుకున్న మేఘన దాని గురించి తన కుటుంబానికి తెలయకుండా జాగ్రత్త పడుతుంది. కొత్త పరిచాయలతో డేటింగ్ చేయాలని స్రష్టి ప్రయత్నిస్తుంటుంది. అయితే తమ కొత్త యాడ్ ఏజెన్సీ కంపెనీలో ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా కష్టపడుంటారు ఈ ముగ్గురు. ఈ సమయంలో రీతూతో గతంలో పరిచయం ఉన్న ప్రసాద్ (హర్ష చెముడు) ఓ గోల్డ్ జ్యువెలరీ ప్రాజెక్ట్‌ను వారికి ఇచ్చేందుకు ముందుకు వస్తాడు. ఈ క్రమంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి..? వాటి నుండి ఈ ముగ్గురు ఎలా బయటపడతారు..? ఇంతకీ ప్రసాద్ గురించి వారు తెలుసుకున్న నిజం ఏమిటి..? అనేది ఈ వెబ్ సిరీస్ కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ వెబ్ సిరీస్ ప్రారంభంలోనే క్యారెక్టర్లను పరిచయం చేసిన తీరు బాగుంది. ఒక్కొక్కరికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్, వారి స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ ముగ్గురు అమ్మాయిల కలిసి చేసే అల్లరి, వారు తమ కంపెనీ కోసం చేసే ప్రయత్నాలు బాగున్నాయి. ఈషా రెబ్బా, రాశి సింగ్ తమ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారు.

సత్య కామెడీ పరంగా నవ్విస్తాడు. తనదైన మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. హర్ష చెముడు కూడా తన పాత్రలో మెప్పిస్తాడు. స్రష్టి పాత్రలో కుషిత చేసే నిబ్బి పనులు కొంతవరకు నవ్వులు తెప్పిస్తాయి.

డార్క్ కామెడీ సీన్స్ కొంతవరకు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ప్రభాస్ శ్రీను పాత్ర చేసే కామెడీ కొంతవరకు ఓకే అనిపిస్తుంది. ఓ పార్టీ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్‌లో కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ పార్టీ చివర్లో వచ్చే ఓ ట్విస్ట్ ప్రేక్షకుల్లో నెక్స్ట్ ఎపిసోడ్స్‌పై ఆసక్తిని క్రియేట్ చేస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సీజన్‌లో కొన్ని కొత్త పాత పాత్రలు ఉన్నా, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు. రీతూ పాత్రకు సంబంధించిన సీన్స్‌ను మరికొంత ఎక్స్‌పాండ్ చేసి ఉంటే బాగుండేది. ఇక మేఘన పాత్రకు కూడా ఇంకాస్త బెటర్ స్పేస్ ఇచ్చి ఉంటే బాగుండు అనిపిస్తుంది.

స్రష్టి చేసే పనులు చాలా వరకు ప్రేక్షకులకు కనెక్ట్ కావు. ఆమె చేసే పనులు కొంత నవ్వులు పూయించినా, పెద్దగా ప్రభావం చూపలేకపోతాయి. ఇక ప్రభాస్ శ్రీను పాత్రకు మంచి స్కోప్ ఇచ్చినా, డార్క్ కామెడీ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.

ఇక రీతూ కోసం మను పాత్రను తీసుకురావడం.. వారి మధ్య సీన్స్ కాస్త ల్యాగ్ అనిపిస్తాయి. అతడి పాత్రను ఇంకాస్త బెటర్‌గా రాసుకోవాల్సింది. పార్టీ ఎపిసోడ్‌లోనూ మరికొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ పెట్టి ఉంటే బాగుండేది. మిగతా ఆర్టిస్టులను కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేదనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు కిరణ్ కె కరవల్ల డైరెక్షన్ బాగుంది. అయితే, డార్క్ కామెడీతో పాటు సత్య కామెడీని ఆయన హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. కొన్ని సీన్స్‌పై ఆయన ఇంకా బెటర్ ఫోకస్ పెట్టాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సంగీతం పరంగా సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకా బెటర్‌గా వర్క్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే, 4 ఎపిసోడ్స్‌తో వచ్చిన ‘3 రోజెస్ సీజన్ 2’ వెబ్ సిరీస్ కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుంటుంది. లీడ్ రోల్స్ ప్లే చేసిన ముగ్గురు హీరోయిన్లు తమ పర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తారు. సత్య, హర్ష తమ కామెడీతో నవ్విస్తారు. అయితే, కొన్ని ల్యాగ్ సీన్స్, ఆకట్టుకోని సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించవు. చాలా మంది యాక్టర్స్‌ను పూర్తిగా వినియోగించుకోలేకపోవడం మైనస్. కామెడీ ఎంటర్‌టైనర్ వెబ్ సిరీస్‌లను ఇష్టపడేవారు ఈ వెబ్ సిరీస్‌ను ఓసారి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు