గబ్బర్ సింగ్ లో భారీ మార్పులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మసాలా ఎంటర్టైనర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘దబాంగ్’ చిత్రానికి రిమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం పవన కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా స్క్రిప్టులో భారీ మార్పులు చేసినట్లు సమాచారం. తెలుగు నేటివిటీ ఉండేట్లుగా పలు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ ఫుల్ లెంగ్త్ పాత్రలో నటిస్తూ ఫ్యాన్స్ కి కనువిందు చేయనున్నారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా పరమేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇటీవలే పొల్లాచ్చిలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో హైదరాబాదులో కొత్త షెడ్యుల్ జరుపుకోనుంది. గబ్బర్ సింగ్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

రాజన్న నా కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అంటున్న నాగార్జున

యదార్ధ సంఘటనల ఆధారంగా కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ‘రాజన్న’ చిత్రం

బదామి వెళ్తున్న రవితేజ-తాప్సీ

రవితేజ-తాప్సీ జంటగా నటిస్తున్న చిత్రం తరువాత షెడ్యుల్ కోసం బదామి వెళ్లనుంది.

రేయ్ చిత్ర షూటింగ్లో మళ్లీ గాయపడిన శ్రద్ధా దాస్

వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో సాయి ధర్మ తేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రేయ్’.

మహేష్ ఎలాంటి పాత్ర చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ ని అడిగిన రాజమౌళి

అగ్ర దర్శకుడు రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు.

స్నేహితుడిగా రాబోతున్న నన్బాన్

హిందీలో అమీర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ చిత్రాన్ని తమిళ్ లో ప్రముఖ దర్శకుడు శంకర్ ‘నన్బాన్’ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

కృష్ణ ఫ్యామిలీ నుండి వస్తున్న మరో నటుడు

సుదీర్ బాబు హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం ‘ఎస్ఎమ్ఎస్’ (శివ మనసులో శ్రుతి).

జనవరిలో దూకుడు 100 రోజుల వేడుక

కలెక్షన్ల విషయంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న ‘దూకుడు’ 100 రోజుల వైపు దూసుకు పోతుంది. ఈ రోజుతో 94 రోజులు పూర్తి చేసుంది. యాక్షన్ మరియు కామెడీ సన్నివేశాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ సంవత్సరంలోనే అతి పెద్ద విజయవంతమైన చిత్రం నమోదయింది. మహేష్ నటన ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఈ సినిమా అధ్బుత విజయంతో మహేష్ తరువాత చిత్రం ‘బిజినెస్ మేన్’ మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమన్ దూకుడు చిత్రానికి అందించిన సంగీతం కూడా చిత్ర విజయానికి బాగా హెల్ప్ అయ్యింది. ఈ విజయం తరువాత తమన్ కి చాలా సినిమాలు చేసే అవకాశం దక్కింది. మహేష్ చేసే బిజినెస్ మేన్ చిత్రానికి కూడా తమన్ సంగీతం అందించారు. దూకుడు 50 రోజుల వేడుకని విజయవాడలో చేసిన నిర్మాతలు 100 రోజుల వేడుకని వచ్చే ఏడాది జనవరిలో చేయడానికి సన్నాహాలు చేయబోతున్నారని సమాచారం.

కలెక్షన్ల తుఫాను సృష్టిస్తున్న డాన్ 2

భాష మరియు ప్రదేశం తో సంబంధం లేకుండా మొదటి రోజు కలెక్షన్ల పై ఆదిపత్యం చెలాయించే కథానాయకులలో షారుఖ్ ఖాన్ ఒకరు. తన ప్రస్తుత చిత్రం డాన్ 2 దేశం మొత్తం కలెక్షన్ల తుఫాను సృష్టిస్తుంది. విశాఖపట్నం మరియు విజయవాడ లాంటి పట్టణాలలో కూడా ఈ చిత్రం ఆదిపత్యం కొనసాగుతుంది. ఈ చిత్రానికి అటు జనం లో ను ఇటు పత్రికల లో ను మంచి సమీక్షలు వస్తున్నాయి. డాన్ 2 చిత్రం డాన్ చిత్రానికి కొనసాగింపుగా వచ్చింది. డాన్ చిత్రం అమితాబ్ బచ్చన్ గారి డాన్ చిత్రం రీమేక్. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించగా షారుఖ్ ఖాన్ మరియు ప్రియాంక చోప్రా లు ప్రధాన పాత్రలు పోషించారు.

కవల పిల్లలకు నామకరణం చేసిన మంచు విష్ణు


“డిసంబర్ 2 న నాకు మరియు విని కి కవల ఆడ పిల్లలు పుట్టారు. దేవుడి దయ వళ్ళ నేను, విని మరియు మా పిల్లలు బాగున్నాము. గత మూడు వారాలుగా నాకు మరియు మా కుటుంబ సభ్యులకు వచ్చిన వందలాది అభినందనలు నాకు చాలా ఆనందం కలిగించాయి. మా పిల్లలని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు న కృతజ్ఞతలు. ఈ క్షణం నా జీవితం లో మరిచిపోలేని క్షణం. ఈ క్షణాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. మా పిల్లలు పుట్టినప్పుడు విని కళ్ళలో ఆనంద బాష్పాలు చూసాను. మా అమ్మ ప్రేమ,విని తల్లి తండ్రులు నేను ఆపరేషన్ ధియేటర్ నుండి బయటకు రాగానే విని ఎలా ఉంది అని అడగటం. మొదటగా డైపర్ మార్చినపుడు లక్ష్మి సహాయం , మనోజ్ ముందు పారిపోయిన మళ్ళి తను కూడా డైపర్ మార్చటం లో సహాయం చేయటం అన్ని తీపి జ్ఞాపకాలుగా మనస్సుల్లో నిలిచిపోయాయి.

జీవితం ఒక్కసారిగా కాంతివంతంగా మరియు సంతోషకరంగా మారిపోయింది. ఇప్పుడు నా జీవితానికి రెండు అర్ధాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో కాకుండా విని కాన్పు ను న్యూ యార్క్ లో చేయటం మీద చాలా మంది పెదవి విరిచారు. కాని విని తను పుట్ట్టిన చోటే తన పిల్లలు పుట్టాలని కోరుకోటం మూలాన ఇలా చెయ్యాల్సి వచ్చింది. హైదరాబాద్ లో కాన్పు జరిగి వుంటే అటు మంచు కుటుంబ సభ్యులు మరియు వై.ఎస్ కుటుంబ సభ్యుల రాకతో పిల్లలతో గడపటం కష్టం అయ్యుండేది. ఇప్పుడు ప్రతి చిన్న క్షణాన్ని పిల్లలతో గడపుతున్నాను. నేను ఒక పెద్ద దర్శకుడి చిత్రాన్ని వదులుకున్న విషయం చాలా మందికి తెలియదు ఆ చిత్రం ఒప్పుకొని ఉంటే మూడు రోజులకు మించి ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పారు. కాని పిల్లలు పుట్టేపుడు దగ్గర వుండటం ఆ అనుబూతి పొందిన వారికే తెలుస్తుంది నాకు ఇంకా వయసుంది నేను సినిమాలు చెయ్యటానికే పుట్టాను కాబట్టి ఇలాంటి అవకాశం మళ్లీ వస్తుందనే అనుకుంటున్నా. నా పరిస్థితి ని ఆ దర్శకుడు అర్ధం చేసుకుంటాడని అనుకుంటున్నా.

నాన్నగారి ఆశీర్వాదం తో మా పిల్లలకు “ఆరియాన మంచు” మరియు “వివియాన మంచు” అని నామకరణం చేశాము. వాళ్ళు ఇద్దరికి నాలాగే సొట్ట బుగ్గలున్నాయి. కాని విని పోలికలే ఎక్కువగా వున్నాయి. ఒక పాప నాలాగా వుండగా ఇంకొక పాప విని లాగా ఉంది . పిల్లలు విని నుండి తెలివి ని , నాన్నగారి నుండి దయ మరియు ప్రతిభ ని , అమ్మ నుండి ఓపిక ను , లక్ష్మి నుండి దైర్యాన్ని, మనోజ్ నుండి చిలిపితనాన్ని, నా నుండి పొడవు(కాస్త తక్కువగా) తెచ్చుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. మా నాన్నలో పది శాతం నాన్నగా వున్నా నేను గొప్ప తండ్రి అవుతాను. “అరి” మరియు “వివి” ల కు ఆశీర్వాదం అందించినందుకు కృతజ్ఞతలు” అని విష్ణు ఈరోజు ప్రెస్ నోట్ విడుదల చేసారు.


రవి

కొలవెరి డీ పాట పాడబోతున్న సునీల్


తమిళ నటుడు ధనూష్ “వై దిస్ కొలవెరి డీ” అనే పాటతో ఇంటర్నెట్ ప్రపంచం లో ప్రభంజనం సృష్టించారు. ఈ పాట యువతని చాల బాగా ఆకట్టుకుంది యుట్యూబ్ లో కొన్ని లక్షల మంది ఈ వీడియో ని చూసారు.

ఇప్పుడు ఈ పాటకి పేరడిని సునీల్ నటిస్తున్న “పూల రంగడు” చిత్రం లో పెడుతున్నారు. ఈ పేరడి చాలా బాగా వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రం 2012 సంక్రాంతి కి విడుదల కాబోతుంది. ఇషా చావ్లా ఇందులో కథానాయికగా నటిస్తుండగా వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కె.అచ్చి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సునీల్ “సిక్స్ ప్యాక్ బాడి” లో కనిపించనున్నారు.

దూసుకుపోతున్న రెబెల్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘రెబెల్’ ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మంచి స్పీడు గా జరుగుతోంది. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దీక్ష సెత్ మరియు తమన్నా కథానాయికలు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాలలో షూటింగ్ జరుగుతోంది.

ఈ చిత్రం లో ప్రభాస్ పూర్తి మాస్ హీరో గా మన ముందుకు రాబోతున్నాడు. ప్రేక్షకులను అలరించే విధం గా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నాం అని దర్శకుడు లారెన్స్ తెలిపారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం అందించగా, జే.భగవాన్ మరియు జే.పుల్లారావు నిర్మాతలు. పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడే హీరో గా ప్రభాస్ ఈ చిత్రం లో కనపడతాడు అని లారెన్స్ చెబుతున్నారు.

2012 లో ఈ చిత్రం తెర మీదకు రాబోతోంది. ప్రభాస్ కాథా లో మరొక హిట్ పడినా? వేచి చూద్దాం .

రచ్చ సినిమా లో రవిబాబు ప్రత్యేక పాత్ర

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తున్న తదుపరి చిత్రం రచ్చ. ఈ చిత్రం లో రామ్ చరణ్ మరియు తమన్నా మెడికల్ కాలేజీ విద్యార్ధులు గా కనిపిస్తారని మేం ఇదివరకే చెప్పాం. తాజాగా, ఈ చిత్రం లో అద్భుతమైన కామెడి ఉందని, పూర్తి కమర్షియల్ హంగుల తో ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది.

ఈ చిత్రం లో ప్రఖ్యాత దర్శకుడు, విలక్షణ నటుడు అయిన రవిబాబు ఒక ప్రత్యేక పాత్ర లో కనపడనున్నారు. ఆయన పాత్ర కడుపుబ్బా నవ్విన్చాతమే కాకుండా , అప్పుడప్పుడు సీరియస్ గా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం లో ఇంకా చాల మంది ప్రఖ్యాత కామెడి నటులు ఉన్నారు.

వచ్చే సంవత్సరం వేసవి సెలవులకు రచ్చ మన ముందుకు రాబోతోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ సరసన తమన్నా తళుక్కు మంటుంది.

సమీక్ష : డాన్ 2

విడుదల తేది : 23 డిశంబర్ 2011
123 తెలుగు .కామ్ రేటింగ్ : 3.75/5
దర్శకుడు : ఫర్హాన్ అక్తర్
నిర్మాత : ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్ద్వాని
సంగిత దర్శకుడు: శంకర్-ఎహాసన్-లాయి త్రయం
తారాగణం : షారుఖ్ ఖాన్ , ప్రియాంక చోప్రా , లారా దత్త

ఐదు సంవత్సరాల తరువాత ఫర్హాన్ అక్తర్ కథా రచయిత, గాయకుడు,నృత్యం, లాంటి వాటి నుండ తను చేయగలిగిన అత్యుతమయిన పని దర్శకత్వం లోకి తిరిగి వచ్చాడు. 2006 లో అమితాబ్ బచ్చన్ 70 ల లో భారి విజయం సాదించిన చిత్రం డాన్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నపుడు చాల మంది కన్ను ఎగేరేసి చూసారు షారుఖ్ ఖాన్ ఎలా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అని కాని దాన చిత్రం విడుదలయ్యాక అన్ని అనుమానాలు నివృతి అయిపోయాయి ఆ చిత్రం స్టైలిష్ గ ఉండటమే కాకుండా ఫర్హాన్ అక్తర్ కథ చెప్పిన విధానం అందరిని మెప్పించింది. ఇపుడు ఈ చిత్రం కూడా అద్బుతంగా స్టైలిష్ గా తీసారు ఈ మధ్య కాలం లో వచ్చిన చిత్రాలలో ఒకానొక మంచి చిత్రం.

కథ :

డాన్ 2 మలేసియా లో మొదలవుతుంది ఆసియా మొత్తం డ్రగ్స్ వ్యాపారాన్ని డాన్ చూసుకుంటూ ఉండగా ఐరోపా దేశాలకు తన వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటాడు. దీనితో అక్కడున్న ఐరోపా దేశాల డ్రగ్ వ్యాపారుల హిట్ లిస్టు లో చేరిపోతాడు. అప్పుడు పోలీసు అయిన మాలిక్(ఓం పురి ) మరియు రోమ(ప్రియాంక) లకు లొంగిపోతాడు. జైలు లో తన పాత శత్రువు అయిన వర్ధన్ (బోమన్ ఇరాని) ని కలుసుకుంటాడు. వర్ధన్ ని తనతో కలవటానికి ఒప్పిస్తాడు.. ఇప్పుడు కథ బెర్లిన్ కి మారుతుంది. ఇక్కడే డాన్ ఎన్నో కోట్లతో కూడిన ప్రణాళిక ని అమలు పరుస్తాడు. మిగిలిన చిత్రం ఎలక పిల్లి మద్య దాగుడుమూతల లా ఐరోపా వ్యాపారాలు మరియు డాన్ మద్య సాగుతుంది ఈ ఆట చివరి వరకు మనల్ని ఉత్కంట కలిగిస్తూ ఉంటుంది.

ప్లస్ :

షారుఖ్ డాన్ పాత్రలో అద్బుతంగా నటించాడు డాన్ పాత్రలో ని స్టైల్ మరియు వ్యక్తిత్వాన్ని అద్బుతంగా చూపించాడు. ఫర్హాన్ కథనం లో మంచి సంభాషణలు ఉన్నాయి. షారుఖ్ వర్ధన్ తో గొడవపడే పాత్ర లోను రోమ ని ప్రేమించే పాత్రలో ను సహజంగా కనిపించాడు మిగిలిన పాత్రధారులు కూడా వాళ్ళ పరిధికి సరిపోయేట్టు గ బాగా చేసారు ప్రత్యేకంగా బోమన్ ఇరాని ,ప్రియాంక, లారా దత్తా, నవాబ్ షా లు బాగా నటించారు. చిత్రం లో పోరాట సన్నివేశాలు చాలానే ఉన్నాయి బెర్లిన్ వీధులలో కార్ చేజ్ సన్నివేశం అయితే అద్బుతంగా వచ్చింది ప్రతి పోరాట సన్నివేశం బాగుంది . నేరుగా జరిగే పోరాట సన్నివేశాలను చాల సహజంగా చిత్రీకరించారు. జేసన్ అందించిన సినిమాటోగ్రఫీ చాల అద్బుతంగా వుంది బెర్లిన్ మరియు ఆసియా అందాలను అద్బుతంగా చూపించారు.

మైనస్ :

ఈ చిత్రం లో చెప్పుకోడానికి పెద్దగా లోపాలు లేవు. చిత్రం లో ఐదు పాటలు ఉండాలనుకునే జనం కాస్త నిరాశ చెందుతారు ఎందుకంటే చిత్రం లో ఒకే ఒక పాట ఉంది. రెండవ అర్ధం లో చిత్రం పొడవు కాస్త తగ్గిచ్చుంటే బాగుండేది. అయిన చిత్రం ఎక్కడా బోర్ అనిపించదు.

నా అభిప్రాయం :

ఒక చిత్రానికి కొనసాగింపు తీయటం అంత సులభమయిన విషయం కాదు. మొదటి భాగంలో చిత్ర కథకి భంగం కలగకుండా కొత్తగా తీయాలి ఈ విషయం లో ఫర్హాన్ సఫలం అయ్యాడు డాన్ 2 చిత్రం మలుపుల తో నేర చరిత్ర ని చూపిస్తూ అద్బుతంగా తెరకెక్కించాడు. డాన్ 2 చిత్రానికి డాన్ 1 లాంటి ఒత్తిడి లేదు ఆ చిత్రం అమితాబ్ బచ్చన్ చిత్రానికి రీమేక్ కాబట్టి ఆ చిత్రం మీద ఒత్తిడి ఎక్కువగా ఉండేది.

చివరి మాట :

డాన్ 1 లానే ఇందులో కూడా మరో కొనసాగింపు వస్తుంది అన్నట్టుగా ముగిస్తారు. కాబట్టి మనం ఇంకొక కొనసాగింపు కోసం వేచి చూడచ్చు

ఎకేఎస్

అనువాదం – రv

123తెలుగు.కాం రేటింగ్: 3.75/5

Don 2 Review English Version

పవన్ కళ్యాణ్ తో గొడవ పడనున్న అభిమన్యు సింగ్

అభిమన్యు సింగ్, రక్త చరిత్ర లో క్రూరమయిన ప్రతినాయకుడు బుక్కా రెడ్డి పాత్రలో నటించారు.

ఆస్ట్రేలియా వెళ్తున్న ప్రియమణి

“క్షేత్రం” విడుదల ఇంకా ఒక వారం రోజుల్లో ఉండగా ప్రియమణి ఆస్ట్రేలియా వెళ్లారు.

త్వరలో మొదలు కానున్న మంచు విష్ణు చిత్రం

చాలా రోజుల నుండి విజయం కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు పూర్తిగా కామెడి మీదే దృష్టి పెట్టినట్టు ఉన్నారు.

రవి తేజ – సూర్య ల త్రీడి చిత్రం

త్వరలో మాస్ మహారాజ రవితేజ మరియు సూర్య లు కలిసి ఒక ద్విభాషా చిత్రం లో నటించబోతున్నట్టుగా

చంచల్ గూడ జైల్లో ఆటో నగర్ సూర్య<


దేవ కట్టా దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న చిత్రం ‘ఆటో నగర్ సూర్య’. ప్రస్తుతం ఈ చిత్రం చంచల్ గూడా జైల్లో షూటింగ్ జరుపుకుంటుంది. నాగ చైతన్యకి జోడీగా సమంతా నటిస్తుంది. ఆటో నగర్ సూర్య విజయవాడ పట్టణ నేపథ్యంలో రూపొందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవ కట్టా గతంలో ప్రస్థానం లాంటి పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా తీసారు. ప్రస్తుతం ఆటో నగర్ సూర్య లేబర్ యూనియన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా మాక్స్ ఇండియా బ్యానర్ పై కె. అచ్చి రెడ్డి నిర్మిస్తున్నారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు సమర్పిస్తుండగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పొల్లాచ్చి నుండి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం “గబ్బర్ సింగ్ ” మూడువారాల షెడ్యూల్ పూర్తయ్యింది .

సమీక్ష : అంచనాలను మించిన “రాజన్న”

విడుదల తేది :22 డిశంబర్ 2011
దర్శకుడు : విజయేంద్ర ప్రసాద్
నిర్మాత : నాగార్జున అక్కినేని
సంగిత డైరెక్టర్ : ఎం.ఎం. కీరవాణి
తారాగణం : నాగార్జున అక్కినేని, స్నేహ, ఏనీ, శ్వేతా మీనన్ మరియు ఇతరులు

కింగ్ నాగార్జున నటించిన యదార్థ గాధ “రాజన్న” రేపు తెర మీదకి రాబోతున్నది. ఈరోజు ప్రసాద్ లాబ్స్ లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఈ చిత్రానికి ప్రఖ్యాత కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించగా కీరవాణి గారు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి పోరాట సన్నివేశాల పర్యవేక్షణ రాజమౌళి గారు చేసారు. ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం.

కథ :

ఇంతకముందే నాగార్జున గారు ఈ కథని చెప్పటం వల్ల ఎక్కువ లోతుగా వెళ్ళట్లేదు. కాని కొత్త వారి కోసం కొంచెం పరిచయం .1950 ల కాలం లో ఆదిలాబాద్ జిల్లా నేలకొండపల్లి అనే గ్రామం లో జరిగిన కథ . ఈ చిత్ర కథా నేపథ్యం తండ్రికూతుళ్ళు అయిన రాజన్న(నాగార్జున) మరియు మల్లమ్మ(అన్నీ) లు మంచి వాళ్ళ కోసం చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. మల్లమ్మ (అన్నీ) చిన్నప్పుడే తన తల్లి తండ్రులని(నాగార్జున & స్నేహ) కోల్పోతుంది. అదే గ్రామం లో ఒక ముసలాయన దగ్గర పెరుగుతూ ఉంటుంది. తనకు ప్రకృతి ఇచ్చిన వరం పాడటం తన పాటతో ఊరందరి మెప్పు పొందుతుంది. ఆ ఊరి దొరసాని(శ్వేతా మీనన్ ) కి మల్లమ్మ పాడటం నచ్చదు మళ్లీ తన పాట వినపడకూడదు అని హుకుం జారి చేస్తుంది. బయపడిపోయిన మల్లమ్మ పండిట్ జవర్హలాల్ నెహ్రు కి త ఊరి సమస్యలని చెప్పుకోటానికి బయలుదేరుతుంది.

కాని ఢిల్లీ లో కూడా దొరసాని మనుషుల వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంది. తన ఆశలు వదిలేసుకున్నాక , తన సంగీత గురువు (నాజర్ ) మల్లమ్మ తండ్రి రాజన్న కథ చెప్పుతాడు.అది విన్న మల్లమ్మ ఏం చేసింది? నెహ్రు గారిని కలిసిందా లేదా ? అనేదే కథా సారాంశం.

నటన:

మొదటగా మనం చెప్పుకోవాల్సింది మల్లమ్మ పాత్రలో నటించిన అన్నీ గురించి. తన నటన అద్బుతం , తన నటన వర్ణనాతీతం తన నటన గురించి చెప్పటానికి మాటలు సరిపోవుటలేదు. ఈ పాత్రకి అన్నీకి ఖచ్చితంగా అవార్డు వస్తుంది అనిపిస్తుంది.తరువాత చెప్పుకోవాల్సింది నాగార్జున గారి గురించి ఇలాంటి చిత్రం కథానుగుణంగా నడిపించటానికి చాలా ధైర్యం కావాలి కథ మీద నమ్మకంతో ఈ ప్రయోగం చేసిన నాగార్జున గారికి అభినందనలు.

మల్లమ్మ పాత్ర చేసిన అన్నీ అద్బుతం గా చేసింది. ముందే చెప్పినట్టు గా తన నటన వర్ణనాతీతం. తన నటనలో చాలా పరిపఖ్వత కనిపించింది. మల్లమ్మ పాత్ర లో హావభావాల ని అద్బుతం గా పలికించింది. తన పాత్ర జనానికి చేరువయ్యేలా చేసింది. మల్లమ్మ ఒక్కొక సమస్యని దాటుతూ వుంటే జనం పాత్ర లో లీనమయిపోతారు.

నాగార్జున రాజన్న పాత్రలో బాగా ఇమిడిపోయారు అయన ఆహార్యం ఆ పాత్ర కి అద్బుతం గా ఉంది . పోరాట సన్నివేశాలలో సంభాషణలను అద్బుతం గా పలికారు. స్నేహ, రాజన్న భార్య లచ్చమ్మ పాత్రలో పరిధి మేరకు బాగానే నటించింది.

శ్వేతా మీనన్ దొరసాని పాత్రలో ప్రతినాయిక పాత్ర పోషిచింది. నాజర్ మరియు గాంధీ వాళ్ళ పాత్ర మేరకు నటించారు. దిలావర్ ఖాన్ పాత్రలో సత్య నాగ్ బాగా నటించాడు. ముఖేష్ ఋషి ప్రతినాయకుడి పాత్రలో బాగా చేసారు. హేమ మరియు తెలంగాణ శకుంతల వారి పాత్ర మేరకు బాగా నటించారు. అజయ్,సుప్రీత్,శ్రావణ్ మరియు ప్రదీప్ రావత్ రాజన్న స్నేహితులుగా బాగా నటించారు.

ప్లస్ :

ఈ కథ నేపథ్యాన్ని అద్బుతంగా వీక్షకులు కథలో లీనమయిపోయెల చెప్పారు. “వేయరా వేయ్” పాట అద్బుతంగా చిత్రీకరించారు వీక్షకుల భావాలని హత్తుకునేల వుంది. ఈ పాటని నేలకొండపల్లి ప్రజలలో చైతన్యం తీసుకురాటానికి పాడుతారు ఈ పాట చివరకి వచ్చెసరికి వీక్షకుల భావాలు కూడా అలానే ఉంటుంది.

ధియేటర్ నుండి బయటకి వచ్చాక కూడా కొన్ని సన్నివేశాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆడవాళ్ళ అందాలకి పన్ను వేసే సన్నివేశం లో నాగార్జున గారి హావభావాలు, దొరసాని దగ్గర పని చేస్తున్న అబ్బాయి తిరుగుబాటు సన్నివేశం మరియు పతాక సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయి.

కీరవాణి గారి సంగీతం చిత్రా నేపధ్యానికి జీవం పోసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే తారా స్థాయి లో ఉంది. పాటలు పాత్ర మరియు కథ నేపథ్యాన్ని అద్బుతంగా వ్యక్తపరిచాయి. “అమ్మ అవని” పాట చిత్రం లో కీలక సన్నివేశాలను ఎత్తి చూపేల ఉంది. కథ మరియు దర్సకత్వం లో విజయేంద్ర ప్రసాద్ గారు సఫలం అయ్యారు.రాజమౌళి గారి పోరాట సన్నివేశాలు చిత్రానికి బలం చేకూర్చాయి.

మైనస్ :

నాగార్జున గారి పరిచయ సన్నివేశాలు ఇంకొంచెం బాగా తీసి వుంటే బాగుండేది. గ్రాఫిక్స్ బాగోలేవు, కొన్న చారిత్రక విషయలను చిత్రానికి అనుగుణంగా మార్చుకున్నారు. పతాక సన్నివేశం తరువాత రాజన్న ఏమయ్యాడు అనే విషయాన్నీ సరిగ్గా చూపించలేదు. చిత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది.

సాంకేతిక విభాగం :

శ్యాం.కే.నాయుడు మరియు అనిల్ బండారి ల సినిమాటోగ్రఫీ కనువిందు చేస్తుంది, దృశ్యాలు చాల బాగా వచ్చాయి .కోటగిరి వెంకటేశ్వర రావు గారి ఎడిటింగ్ చాలా బాగుంది. రవీందర్ చేసిన ఆర్ట్ వర్క్ నిజమనిపించేల వుంది.

తీర్పు :

నేలకొండపల్లి ప్రజల కష్టాల నడుమ జరిగే ఒక పోరాటం “రాజన్న ” చిత్రం. బేబీ అన్నీ మరియు నాగార్జున ల నటన అద్బుతం. కీరవాణి గారి సంగీతం మరియు రాజమౌళి గారి పోరాట సన్నివేశాల చిత్రీకరణ ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చాయి . ఈ చిత్రం లో మనస్సుని హత్తుకునేల చాలా సన్నివేశాలు వున్నాయి . ఇలాంటి కథా నేపథ్యాన్ని ఎంచుకొని ధైర్యం గా చిత్రీకరించిన నాగార్జున గారికి అభినందనలు తెలపాలి. ఈ చిత్రం తప్పకుండా చూడాల్సిన చిత్రం .

మహేష్ కె.ఎస్

అనువాదం – రv

123తెలుగు.కాం రేటింగ్:

రాజన్న చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. రాజన్న చిత్రం చాల బావుంది చూసి ఎంజాయ్ చేయండి.

Rajanna Review English Version

జనవరిలో ప్రారంభం కానున్న రజినీకాంత్ కొత్త చిత్రం


రజినికాంత్ నటించబోయే తరువాత చిత్రం ‘కొచ్చడయాన్’. ఈ చిత్రం జనవరి 2 నుండి చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. రజినికాంత్ ‘రాణా’ సినిమాలో నటించాల్సి ఉండగా ఆయన అనారోగ్యం పాలవడంతో ఆ చిత్రం ఆగిపోయింది. ప్రస్తుతానికి రాణా చిత్రాన్ని పక్కన పెట్టి నూతన చిత్రానికి శ్రీకారం చుట్టారు. కొచ్చడయాన్ చిత్రానికి రజినికాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం కోసం కే.ఎస్. రవి కుమార్ కథ అందించనున్నారు. రజినికాంత్ సరసన నటించడానికి అనుష్క మరియు అసిన్ లను సంప్రదించినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారు. కొచ్చడయాన్ కి ఛాయాగ్రాహకుడిగా రాజీవ్ మీనన్ పని చేయబోతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబందించిన భాద్యతలు కూడా ఈయనే చూసుకుంటాడని సమాచారం.

50 రోజులు పూర్తి చేసుకున్న నువ్విలా


నూతన నటీ నటులతో రవిబాబు తీసిన చిత్రం ‘నువ్విలా’. ఈ చిత్రం మంచి విజయం సాధించి నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. రవి బాబు గతంలో నూతన నటులతో ‘నచ్చావులే’ చిత్రం తీసి విజయం సాధించారు. ఆ చిత్రంలో తనీష్ మరియు మాధవీ లత లను తెలుగు తెరకు పరిచయం చేసారు. ఇక నువ్విలా విషయానికి వస్తే హవీష్, అజయ్, ప్రసాద్ బార్వి, విజయ్ సాయి, యామి గౌతమ్, సరయు, రమ్య కొత్త నటులను పరిచయం చేసారు. నూతన నటులను ప్రోత్సహించే రామోజీ రావు గారు ఈ చిత్ర నిర్మాత. నువ్విలా మరియు నచ్చావులే రెండు చిత్రాలకు ఆయనే నిర్మించడం విశేషం. నువ్విలా చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

రాజన్న చిత్ర విజయం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు శుభ పరిణామం

యదార్ధ సంఘటనల ఆధారంగా కింగ్ అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ‘రాజన్న’. ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతుండగా నిన్న ఈ చిత్రాన్ని ప్రముఖలకు ప్రిమియర్ షో వేయడం జరిగింది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాల బావుందని నాగార్జున గారి కెరీర్లో మర్చిపోలేని చిత్రం అవుతుందని చెప్పారు.రాజన్న చిత్ర విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మంచి శుభ పరిణామం. ఈ సంవత్సరం మొదటి భాగంలో ఎక్కువ విజయాలు లేకపోయినప్పటికీ ద్వితీయార్ధం మాత్రం మంచి విజయాలు దక్కాయి. అగ్ర హీరోలు కూడా విజయాలు దక్కించుకున్నారు. ‘శ్రీ రామ రామ రాజ్యం’ తో బాలకృష్ణ విజయం సాధించగా, ‘రాజన్న’ తో నాగార్జున పెద్ద విజయం సాధించారు. ‘దూకుడు’ తో మహేష్ భారీ హిట్టే సాధించారు.

ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డుల మోత మోగించింది. ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ తో పర్వాలేదనిపించాడు. ఈ చిత్రం నిర్మాతకు నష్టాలు రాకుండా బయట పడింది. నవతరం నటులు రామ్ మరియు నారా రోహిత్ ‘కందిరీగ’ మరియు ‘సోలో’ చిత్రాలతో మంచి విజయాలు దక్కించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ చిత్రం ‘పంజా’ తో పర్వాలేదనిపించాడు. అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’ తో కమర్షియల్ విజయం సాదించాడు. ఈ విజయాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కలకలాడుతోంది. వచ్చే ఏడాది కూడా ఇంత కంటే భారీ విజయాలు సాధించాలని కోరుకుందాం.

సమీక్ష 2 : అదరగొట్టిన రాజన్న

విడుదల తేది :22 డిశంబర్ 2011
దర్శకుడు : విజయేంద్ర ప్రసాద్
నిర్మాత :  నాగార్జున అక్కినేని
సంగిత డైరెక్టర్ : ఎం.ఎం. కీరవాణి
తారాగణం : నాగార్జున అక్కినేని, స్నేహ, ఏనీ, శ్వేతా మీనన్ మరియు ఇతరులు

రగడ వంటి కమర్షియల్ హిట్ కొట్టి ఆ తరువాత గగనం వంటి ప్రయోగాత్మక చిత్రం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాగార్జున ప్రముఖ రచయిత మరియు రాజమౌళి తండ్రి గారు అయిన విజయేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో రాజన్న చిత్రం చేసారు. అగ్ర దర్శకుడు రాజమౌళి కీలక సన్నివేశాలకు మరియు యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రేక్షకుల తీర్పు కోరుతూ మన ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం.

కథ:

రాజన్న చిత్ర కథ 1950లో ఆదిలాబాద్ జిల్లా లోని నేలకొండపల్లి అనే గ్రామంలో మొదలవుతుంది. నేలకొండపల్లిలో ఉండే మల్లమ్మ (ఏనీ) ని ఒక పెద్దయన అల్లారుముద్దుగా పెంచుతాడు. మల్లమ్మకి పాటలంటే ఎంతో ఇష్టం. మల్లమ్మని బడిలో చేర్పించడానికి ఆ ఊరిలో ఉండే దొరసాని అనుమతి కోసం వెళ్తారు. అక్కడ పాట పాడి దొరసాని ఆగ్రహానికి గురవుతుంది. మళ్లీ పాట పాడితే చంపేస్తానని హుకుం జారీ చేస్తుంది. ఒకానొక సందర్భంలో మల్లమ్మ అనుకోకుండా పాట పాడితే మల్లమ్మని పెంచిన పెద్దాయనని చంపేస్తుంది దొరసాని. మల్లమ్మని కూడా చంపబోతే సంగీతం మాస్టారు (నాజర్) కాపాడతాడు. దొరసాని బాధల నుండి నుండి తన ఊరికి విముక్తి లభించాలంటే డిల్లీలో ఉన్న ప్రధాన మంత్రి నెహ్రు గారి వల్ల మాత్రమే అవుతుంది అని తెలుసుకొని కాలినడకన డిల్లి కి వెళుతుంది. మల్లమ్మ డిల్లీలో ఉన్న విషయం దొరసానికి తెలుసుకుని మల్లమ్మని బందిస్తుంది. దొరసాని నుండి ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో తెలియక ఏడుస్తున్న మల్లమ్మ కి “రాజన్న” వీర గాధ ని సంగీతం మాస్టారు చెబుతాడు. ఇంతకు రాజన్న ఎవరు. ఆయనకి మల్లమ్మకి ఉన్న సంబంధం ఏమిటి. మల్లమ్మ నెహ్రు ని కలిసిందా లేదా అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

మల్లమ్మ పాత్రలో నంటించిన ఏనీ చాలా అధ్బుతంగా నటించింది. మల్లమ్మ పాత్రని ఏనీ తప్ప ఇంకెవరు ఇంకెవరు చేయలేరు అనిపించేలా చేసింది. పాటల్లో తన అభినయం చాలా బావుంది. తన అమాయకత్వం కలగలిసిన నవ్వుతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేస్తుంది. మల్లమ్మ పాతకి ఏనీ కి అవార్డులు గెలుచుకుంటుంది. రాజన్న పాత్రలో నాగార్జున చాలా బాగా చేసిరు. సినిమాలో నాగార్జునని కాకుండా రాజన్నని మాత్రమే చూస్తాం. వెయ్ వెయ్ పాటలో నాగ్ నటన అధ్బుతం. మరియు 200 మంది రాజకార్లతో పోరాడే సన్నివేశాలు ఆయన అభిమానుల్ని అలరిస్తాయి. లచ్చువమ్మ గా స్నేహ బాగా చేసింది. రజకారులు తన అవమానిస్తే బరిసేతో చంపే సన్నివేశంలో అమ్మవారి అవతరంలా కనిపిస్తుంది. దొరసాని గా నటించిన శ్వేతా మీనన్ బాగా నటించింది. మల్లమ్మని పెంచిన పెద్దాయన మరియు సంగీతం మాస్టారిగా బాగా చేసారు. దిలావర్ ఖాన్ గా సత్య దేవ్, ముఖేష్ రుషి, రవి కాలే, హేమ, తెలంగాణా శకుంతల, విజయ్ కుమార్ తమ పాత్ర పరిధిలో నటించారు. రాజన్న స్నేహితులుగా అజయ్, సుప్రీత్, శ్రవణ్, ప్రదీప్ రావత్ బాగానే చేసారు.

మైనస్ పాయింట్స్:

నాగార్జున మొదటిసారి తెరపై కనిపించే సన్నివేశంలోని ఇంకా బాగా తీసి ఉంటే బావుండేది. ఆ సన్నివేశంలో డైలాగులు కూడా సరిగా పండలేదు. చిత్రం మొత్తం పూర్తి తెలంగాణ యాసలో ఉండటం వలన తెలంగాణేతర ప్రజలకి భాష విషయంలో కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. రాజన్న పాత్రకి ముగింపు సరిగా ఇవ్వకపోవడం కూడా కొంత భాధ కలిగిస్తుంది.
చిత్ర మొదటి భాగంలో 7పాటలు ఉండటం, కామెడీ సన్నివేశాలు లేకపోవడంతో అక్కడక్కడ బోర్ అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

శ్యాం కె నాయుడు, శ్యాం బండారి, పూర్ణ అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. నేలకొండపల్లి గ్రామలో సన్నివేశాలు చాలా సహజంగా చూపించారు. రాజమౌళి ప్రతి సినిమాకు ఎడిటర్ గా పని చేసే కోటగిరి వెంకటేశ్వర రావు గారు ఈ సినిమాను కూడా బాగా ఎడిట్ చేసారు. రాజమౌళి గారి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి తన సంగీతంతో మేజిక్ చేసారు. పాటలతో ప్రేక్షలను ఉర్రూతలూగిస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోసారు. లచ్చువమ్మ పాటకి శివ శంకర్ కొరియోగ్రఫీ బావుంది. ఫైట్స్ సినిమాకి హైలెట్. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం కూడా చాలా బావుంది.

తీర్పు:

రాజన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని చిత్రంలో లీనమయ్యేలా చేస్తుంది. చిత్ర మొదటి భాగం ఏనీ అధ్బుత నటన తో అలరిస్తే, రెండవ భాగం నాగార్జున గారి నటనతో సినిమా హైలెట్ చేసారు.
ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చుతుంది. ఈ చిత్రం తప్పకుండా చూడండి.

అశోక్ రెడ్డి. ఎమ్

123తెలుగు.కాం రేటింగ్:
రాజన్న చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. రాజన్న చిత్రం చాల బావుంది చూసి ఎంజాయ్ చేయండి.

Rajanna Review English Version

ఈరోజు ఎం.ఎస్. రెడ్డి గారి పెద్ద ఖర్మ

ప్రఖ్యాత కవి మరియు చిత్ర నిర్మాత ఎం.ఎస్. రెడ్డి గారి పెద్ద ఖర్మ ఈ రోజు జూబ్లీ హిల్స్ క్లబ్ లో జరిగింది.

పుట్టిన రోజు జరుపుకొంటున్న తమన్నా

ఈ తరం కథానాయికల లో “మిల్క్ వైట్ బ్యూటి” గా పేరొందిన ఒకే ఒక తార తమన్నా.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దమ్ము


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దమ్ము’. ఈ చిత్రం పవర్ఫుల్ డైలాగ్స్ మరియు అధ్బుతమైన యాక్షన్ సన్నివేశాలతో రూపుదిద్దుకుంటుందని సమాచారం. బోయపాటి శీను ఫాన్స్ కి విందు భోజనం అందించాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ కి జోడీగా త్రిషా మరియు కార్తీక నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పలు విభిన్నమైన పాత్రలో మరియు త్రిషా మూడు విభిన్నమైన గెటప్ లో కనిపిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోలో 4 పాటలు రికార్డింగ్ పూర్తయింది.ఈ పాటలు చాలా బావున్నాయని రాజమౌళి కూడా చెప్పడం జరిగింది.

రామోజీ ఫిలిం సిటీలో రచ్చ


మెగా పవర్ స్టార్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘రచ్చ’. ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక్కడే చిత్రంలోని ముఖ్య నటీ నటులతో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో అందాల భామ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. చిరంజీవి గారి ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘వాన వాన వెల్లువాయే’ పాటను రీమిక్స్ చేసి ఈ చిత్రంలో. సంపత్ నంది దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.పరాస్ జైన్ మరియు ఎన్.వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఆర్.బి చౌదరి సమర్పిస్తున్నారు. ఇటీవలే బ్యాంకాక్, చైనా, శ్రీలంకలో కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. రచ్చ శరవేగంగా పూర్తి చేసి మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అభిమానులను ఆనంద పరుస్తున్న బిజినెస్ మాన్ ఆడియో


ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సంవత్సరం “దూకుడు” లాంటి భారి చిత్రాన్ని అందించిన మహేష్ బాబు ఇప్పుడు మళ్లి రికార్డ్లు లు బద్దలు కొట్టడానికి “బిజినెస్ మాన్ ” గా వస్తున్నాడు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక ఈ నెల 22 న భారిగా జరగనుండగా ఈ చిత్రం లో అన్ని పాటల టీజర్స్ ని విడుదల చేసారు. ఈ పాటలు బయటకి వచ్చినప్పటి నుండి అభిమానులు ఆనందం ఎక్కువయ్యింది ఒక భారి విజయానికి కావలసిన అన్ని విషయాలు ఈ చిత్ర సంగీతం లో ఉందని అభిమానులు అంటున్నారు. సామాన్య ప్రజలు కూడా ఈ చిత్ర సంగీతాన్ని బాగా ఆహ్వానించారు. నిన్న ట్విట్టర్ మరియు పేస్ బుక్ మొత్తం బిజినెస్ మాన్ మానియా నడిచింది.

మహేష్ బాబు అభిమానుల్లో ఒకరయిన రాకేశ్ చిత్ర ఆడియో గురించి చెపుతూ ” ‘సార్ వస్తార’ పాట అద్బుతంగా ఉందని, ‘ఆమ్చి ముంబై ‘ పాట జనానికి చేరువయ్యే పాట అని అన్నారు”. ఇంత మంచి ఆల్బం ఇచినందుకు పూరి గారికి మరియు తమన్ గారి కృతజ్ఞతలు తెలుపుతూ పూర్తి పాటలు కోసం చాల ఆసక్తి గ వేచి చూస్తున్నామని చెప్పారు.

మేము ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక ను రేపు నేరుగా వేదిక నుండి “లైవ్ అప్డేట్స్” ఇస్తాము. బిజినెస్ మాన్ గురించి మరి కొన్ని ఆసక్తికరమయిన విషయాల కోసం మా సైట్ ని ఫాలో అవ్వండి.

మంచి కారణం కోసం రాజన్న ప్రదర్శనలు

అక్కినేని నాగార్జున గారు నటించిన “రాజన్న” చిత్రం డిసెంబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

కల్కిలా రాబోతున్నబాలకృష్ణ ?

ఇప్పుడు పరిశ్రమలో వచ్చిన పుకారుల ప్రకారం రాబోతున్న బాలకృష్ణ చిత్రానికి “కల్కి” అనే పేరు ని ఖరారు చేసినట్ట్టు తెలుస్తుంది.

ఏ. ఆర్. రెహమాన్ ప్రదర్శన ని నిరాకరించిన పురావస్తు శాఖ

ఏ. ఆర్. రెహమాన్ మరియు గౌతం మీనన్ ల కలయిక లో వస్తున్న చిత్రం “ఏక్ దీవానా థా”